న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ డబుల్ సెంచరీ, టెస్టుల్లో మూడోది: 9వ స్థానంలో దిగి జయంత్ సెంచరీ

భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. కోహ్లీ 302 బంతుల్లో 23 ఫోర్‌లతో 200 పరుగులు చేశాడు.

ముంబై: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. కోహ్లీ 302 బంతుల్లో 23 ఫోర్‌లతో 200 పరుగులు చేశాడు. కోహ్లీకి టెస్టుల్లో ఇది మూడో డబుల్ సెంచరీ. కోహ్లీ దూకుడైన ఆటతో భారత్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ముంబైలో కోహ్లీ పలు రికార్డులు సాధించాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఒక సిరీస్‌లో 500 పై చిలుకు పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకొని, ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మూడు ఫార్మాట్లలోను 50కి పైగా సగటు అందుకొని ఈ మార్కు దాటిన ఏకైక ఆటగాడిగా రికార్డుకెక్కాడు. టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయి దాటాడు.

Virat Kohli

జయంత్ శతకం

వాంఖడే స్టేడియంలో జయంత్‌ యాదవ్‌ శతకం సాధించాడు. 196 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా భారత్‌ తరపున తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా జయంత్‌ చరిత్ర సృష్టించాడు. అనంతరం 104 పరుగుల వద్ద అవుటయ్యాడు. జట్టు స్కోరు 615 వద్ద కోహ్లీ (215) అవుటయ్యాడు.

కాగా, భారత టెస్ట్ క్రికెట్‌ జట్టు సారథి ఎనిమిదో వికెట్‌కు కోహ్లి(235), జయంత్‌(104) 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత, భారత్ 182.3 ఓవర్లకు 631 పరుగుల వద్ద ఆలౌటైంది. రషీద్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(9) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 231 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

హ్లీ (848 పాయింట్లు) వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఛాపెల్‌-హెడ్లీ వన్డే ట్రోఫీలో వరుస శతకాలతో 299 పరుగులు చేసిన ఆసీస్‌ విధ్వంసక క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (846) మూడో స్థానంలో ఉన్నాడు.

సచిన్ రికార్డు సమం: ముంబైలో కోహ్లీ రికార్డులివేసచిన్ రికార్డు సమం: ముంబైలో కోహ్లీ రికార్డులివే

వీరిద్దరి మధ్య రెండు పాయింట్ల తేడానే ఉండడం గమనార్హం. దక్షిణాఫ్రికా కెప్టెన్‌, 360 డిగ్రీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ ఎప్పటిలాగే 861 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సహచరులైన వీరిద్దరి మధ్య తేడా 13 పాయింట్లే.

గెలుపు కోసం భారత్, డ్రా కోసం ఇంగ్లాండ్

నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ను ముందుగానే సాధించాలని భారత్ భావిస్తుండగా మరోవైపు ఇంగ్లాండ్ కనీసం డ్రాతో బయటపడాలని యోచిస్తోంది. ఇంగ్లాండు కనీసం డ్రాతో బయటపడాలని యోచిస్తోంది. భారత్ విజయం కోసం ఆరాటపడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సోమవారం చివరి రోజు పూర్తిగా పోరాడాలి. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో భారత్ 231 పరుగుల ముందంజలో ఉంది. (తొలి ఇన్నింగ్సులో భారత్ 631 పరుగులు, ఇంగ్లాండ్ 400 పరుగులు). నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 49 పరుగుల ముందంజలో భారత్ ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X