న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో మైలురాయి: ఎలైట్ గ్రూప్‌లో చేరిన కెప్టెన్ కోహ్లీ

By Nageshwara Rao

ఆంటిగ్వా: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన డబుల్ సెంచరీ చిరస్మరణీయం. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో డబుల్ సెంచరీ సాధించడంతో కెప్టెన్ కోహ్లీ భారత క్రికెటర్ల ఎలైట్ గ్రూపులో చేరాడు.

వెస్టిండిస్‌పై డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అన్ని ఫార్మెట్లలలో 12,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ మైలు రాయిని అందుకున్న ఎనిమదవ భారతీయ ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల జాబితాలో చూస్తే 51వ ఆటగాడు.

జులై 24న వెస్టిండిస్‌లో ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్ (113 పరుగులతో పాటు 7 వికెట్లు) టీమిండియాను ఇన్నింగ్స్ 92 పరుగుల ఆధిక్యంతో కూడిన విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్ ద్వారా విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

2008లో శ్రీలంకపై దంబుల్లాలో జరిగిన వన్డే సిరిస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. భారత్ తరుపున 12,000లకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే...

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మెట్లు కలుపుకుని 34,357 పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ నిలిచారు.

రాహుల్ ద్రవిడ్

రాహుల్ ద్రవిడ్

'ద వాల్'గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మెట్లలో రాహుల్ ద్రవిడ్ చేసిన పరుగులు 24,0208.

 సౌరభ్ గంగూలీ

సౌరభ్ గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. సౌరభ్ గంగూలీ చేసిన పరుగులు 24,0208.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ పేరుతెచ్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 17,253 పరుగులు చేశాడు.

 మహ్మద్ అజారుద్దీన్

మహ్మద్ అజారుద్దీన్

అంతర్జాతీయ క్రికెట్‌లో 15,593 పరుగులు సాధించిన మహ్మద్ అజారుద్దీన్ కొన్ని కారణాల వల్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

 మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

ప్రస్తుతం వన్డేలు, టీ20ల కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని 14,863 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు.

 సునీల్ గవాస్కర్

సునీల్ గవాస్కర్

టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ సునీల్ గవాస్కర్. అంతర్జాతీయ క్రికెట్‌లో 13,214 పరుగులతో గవాస్కర్ ఆ తదుపరి స్థానంలో ఉన్నారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

తాజాగా ఎలైట్ గ్రూప్‌లో విరాట్ కోహ్లీ చేరాడు. జులై 26, 2016 నాటికి అంతర్జాతీయ క్రికెట్‌లో 12,047 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X