న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఓ సూపర్ స్టార్: 'క్రికెట్ ఎంతో అదృష్టం చేసుకుంది'

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సూపర్ స్టార్ అంటూ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

By Nageshwara Rao

చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సూపర్ స్టార్ అంటూ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెక్ కల్లమ్ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ లాంటి ఆటగాడు క్రికెట్‌లో ఉండటం గేమ్ చేసుకున్న అదృష్టమని కొనియాడాడు.

<strong>ఫోటోలు: తలపై ప్రేమగా నిమురుతూ కెప్టెన్ కోహ్లీ</strong>ఫోటోలు: తలపై ప్రేమగా నిమురుతూ కెప్టెన్ కోహ్లీ

గత కొంతకాలంగా మూడు ఫార్మెట్లలో విరాట్ కోహ్లీ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఒక సూపర్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. మైదానంలో తన విధ్వంసకర ఆటతీరుతో చెలరేగే కోహ్లీ, తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించేలేదని చెప్పుకొచ్చాడు.

Virat Kohli is a superstar, cricket is blessed to have him: Brendon McCullum

మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ, మైదానం బయట ఎంతో హుందాగా ఉంటాడని పేర్కొన్నాడు. ఇలా ఉండటం ఎవరికైనా సవాల్ లాంటిదని మెక్‌కల్లమ్ చెప్పాడు. క్రికెట్ క్రీడలో కోహ్లీ ఆడటం ఆ గేమ్ చేసుకున్న అదృష్టమని అన్నాడు. గత కొంతకాలం నుంచి అత్యంత నిలకడగా రాణిస్తూ భారత్‌కు అనేక విజయాలను అందిస్తున్నాడని తెలిపాడు. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో కోహ్లీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ డబుల్ సెంచరీలు సాధించి భారత్ కెప్టెన్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. వరుసగా టీమిండియా ఐదు టెస్టు సిరిస్‌లను గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. తన కెప్టెన్సీలో భారత్‌కు తిరుగులేని విజాయలనందించాడు.

<strong>సెంచరీతో క్రీజులో కొడుకు: మరణవార్తను తెలియనివ్వని తండ్రి</strong>సెంచరీతో క్రీజులో కొడుకు: మరణవార్తను తెలియనివ్వని తండ్రి

ఒకవైపు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, మరొవైపు అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేస్తున్న కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ తన బ్యాటింగ్ యావరేజిని మెరుగుపరచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 235గా ఉంది.

మూడు ఫార్మెట్లలో కూడా 50కి పైగా యావరేజి కలిగి ఉన్న భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ ఇప్పటికే 640కి పైగా పరుగులు సాధించాడు. ఒక సిరిస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సునీల్ గవాస్కర్ తర్వాత మూడో స్ధానంలో నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X