న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న చనిపోయినా దుఃఖాన్ని దిగమింగుతూ క్రికెట్ ఆడటానికి వెళ్లా: కోహ్లీ

By Nageswara Rao

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. తన క్రికెట్ జీవితం ప్రారంభ సమయంలోనే కొన్న చేదు అనుభవాలను చూశానని కోహ్లీ తాజాగా పేర్కొన్నారు.

'నేను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న గుండె పోటుతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మరణించారు. అప్పుడు నేను ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాను. 40 పరుగులు చేశాను. ఓవర్ నైట్ బ్యాట్స్‌మెన్‌గా తెల్లవారి క్రీజ్‌లోకి వెళ్లాల్సి ఉంది.' అని చెప్పారు.

'ఈ సమయంలో మా నాన్న మరణించడంతో ఇంటికి వెళ్లిన నేను ఢిల్లీ కోచ్‌కు ఫోన్ చేసి ఆడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాను. ఎందుకంటే నేను నమ్ముకున్న క్రికెట్‌ను పూర్తి చేయకుండా ఉంటే అది నా తప్పు అవుతుంది. ఒకపక్క దుఃఖాన్ని దిగమింగుతూనే బ్యాట్ పట్టుకుని క్రీజ్ లోకి వెళ్లడానికి సిద్ధ పడ్డా.' అని తెలిపారు.

 Virat Kohli: My aggression is hard to control

'ఆ క్షణమే నన్ను వ్యక్తిగా మార్చింది. ఒక క్రీడాకారుడిగా ఆటకు విలువ ఇవ్వబట్టే ఈరోజు నా క్రికెట్ జీవితం ఉన్నత స్థాయిలో ఉంది' అని కోహ్లి ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే తనలోని దూకుడు స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డానని కూడా చెప్పారు.

దూకుడు నియంత్రించుకోవడం చాలా కష్టం

కొన్నిసార్లు తన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. ఈ దూకుడు స్వభావంతోనే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంఫైర్‌ను దూషించినందుకు గాను మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు.

'నా శరరీంపై టాటాలు ఉంటాయి. పలు సందర్భాల్లో నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా జరిమానా విధించబడ్డాను. అయితే తానెప్పుడూ మరి రూడ్‌గా లేను' అని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ కూడా క్రికెట్ కోసం కష్టపడతానని, అయితే క్రికెట్‌లో ఈ విధంగానే ప్రవర్తించాలంటూ ఓ కోడ్ అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

క్రికెట్‌పై ప్రభావం

మ్యాచ్ ఫలితాలు కోహ్లీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కోహ్లీకి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు 'ద రన్ మెషిన్'. అండర్ -19 నుంచి భారత్ టెస్టు కెప్టెన్‌గా ఎదిగిన కోహ్లీ భారత్‌కు 2008 వరల్డ్ కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

2014లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ప్లేయర్ ఆఫ ద టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. వన్డేల్లో ఒకే కేలండర్ ఇయర్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా కారుల్లో విరాట్ కోహ్లీ ఒకడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X