న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: 'కెప్టెన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికైన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ 'కెప్టెన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికయ్యాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ 'కెప్టెన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికయ్యాడు. క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో 10వ వార్షికోత్సవం సందర్భంగా క్రికెటర్లకు అవార్డులను ప్రకటించింది.

ఈ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. గతేడాది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 12 టెస్ట్‌ల్లో 9 మ్యాచ్‌లు విజయం సాధించింది. ఇక దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో 198 బంతుల్లో 258 పరుగులు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ టెస్టు బ్యాటింగ్ ఫెర్ఫార్మెన్స్ అవార్డుకు ఎంపికయ్యాడు.

Virat Kohli named as captain of the year at ESPN Cricinfo Awards

ఇక, ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ (6/17) అద్భుత ప్రదర్శనతో బెస్టు బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 178 పరుగులతో రాణించిన క్వంటన్ డీకాక్ వన్డే బ్యాటింగ్ ఫెర్పామెన్స్ ఆఫ్ ద ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

ఇటీవలే వెస్టిండిస్ టీ20 జట్టుకు కెప్టెన్‌‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్‌వైట్ టీ20 ఫెర్పామెన్స్ ఆఫ్ ద ప్లేయర్‌‌గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ మోహిదీ హాసన్ మిరాజ్ అరంగేట్రం చేసిన ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

మాజీ క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ చాపెల్, జయవర్దనే, రమీజ్ రజా, కోట్నీ వాల్ష్, బౌచర్‌తో పాటు ఇషా గుహ, సంబిత్ బాల్, సైమన్ తౌఫెల్, ఈఎస్‌పీఎన్ సీనియర్ ఎడిటర్లు, రైటర్లతో కూడిన జ్యూరీలో భారత్ నుంచి కోహ్లీ మాత్రమే అవార్డుకు ఎంపికయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X