న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకో: హితబోధ చేసిన చాపెల్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో తొలి రెండు టెస్టుల్లో చోటు చేసుకున్న స్లెడ్జింగ్ ప్రమాదకర స్థాయిలో ఉందని ఆసీస్ లెజెండరీ ఆటగాడు ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో తొలి రెండు టెస్టుల్లో చోటు చేసుకున్న స్లెడ్జింగ్ ప్రమాదకర స్థాయిలో ఉందని ఆసీస్ లెజెండరీ ఆటగాడు ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. మైదానంలో శృతి మించిపోతున్న ఈ తరహా చర్యలను ఆపేందుకు ఆయా క్రికెట్ బోర్డులు నడుంబిగించాల్సిన అవసరం ఉందన్నాడు.

ఛానెల్ నైన్‌కి రాసిన కాలమ్‌లో ఇయాన్ చాపెల్ తీవ్రస్థాయిలో స్పందించాడు. 'ఇక నుంచి ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ఘటనలపై బోర్డు అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు రాళ్లు విసిరేందుకు సిద్ధంగా ఉన్నారని నేను భావించడం లేదు' అని అన్నాడు.

'గతంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో కూడా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసుకున్న ఘటనలు అనేకం. అయితే ఆ దూకుడు ఎప్పుడూ పరిధిలోనే ఉండటంతో క్రికెట్‌కు మంచే జరిగేది. అయితే ఆన్ ఫీల్డ్‌లో ఆటగాళ్ల వ్యవహారాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. దీనిపై బోర్డులు మాత్రం పూలిష్‌గా వ్వవహరిస్తున్నాయి' అని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.

Virat Kohli needs to keep his on-field emotions in check: Ian Chappell

'ఇలానే సాగితే సమస్య వస్తుంది. ఆటగాళ్ల కారుకూతులకు స్టేడియంలో అంపైర్లు, ప్రేక్షకులే సాక్ష్యం. వారి పిచ్చి కూతలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకవేళ బోర్డు అధికారులు ఈ తరహా చర్యలను చూస్తూ కూర్చుంటే అది వారి చేతకానితనమే అవుతుంది' అని చాపెల్ పేర్కొన్నాడు.

బెంగుళూరు టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యహరించిన తీరును చాపెల్ తప్పుబట్టాడు. 'కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఎమోషన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కెప్టెన్‌గా అన్ని ఎమోషన్స్‌ను కోహ్లీ అదుపు చేసుకోవాల్సి ఉంటుంది' అని చాపెల్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X