న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నో ప్రాబ్లమ్, ఎంతో మందిని చూశా: మిల్స్‌పై కోహ్లీ

ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీని అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ పేస్ సెన్సేషన్ తైమాల్ మిల్స్‌ను బరిలోకి దించనుంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌లో కెప్టెన్ కోహ్లీని అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ పేస్ సెన్సేషన్ తైమాల్ మిల్స్‌ను బరిలోకి దించనుంది. తొలి టీ20 సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ అతనిని చూసి తానేమీ భయపడటం లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ఇంగ్లాండ్ జట్టులోకి కొత్తగా వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైమాల్‌ మిల్స్‌ గురించి తమకు ఆందోళన లేదని అన్నాడు. తన కెరీర్‌లో గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసిరే ఎంతోమంది బౌలర్లను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. మిల్స్ బౌలింగ్‌ని తానింత వరకు చూడలేదని మీడియా సమావేశంలో ఓ బ్రిటిష్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ చెప్పాడు.

Virat Kohli on England's Tymal Mills: No problem, I have faced 'enough 90-mile bowlers'

'నా కెరీర్‌లో 90 మైళ్ల స్పీడుతో వచ్చిన బంతులను ఆడాను. అతడిని ఇంగ్లాండ్ జట్టు టీ20 స్పెషలిస్ట్‌గా తీసుకొస్తుందంటే అతడు ఈ ఫార్మాట్‌కు తప్పక సరిపోతాడని భావిస్తున్నా' అని పేర్కొన్నాడు. కోహ్లీని కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్ జట్టు సరికొత్త 'వెపన్'ని తీసుకొచ్చిందా? అన్న ప్రశ్నకుగాను కోహ్లీ నవ్వేసి ఊరుకున్నాడు.

దీనిపై కోహ్లీ ప్రస్తుతానికి దీనిపై తానేమీ మాట్లాడలేనని, తొలి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్న తర్వాత రెండో గేమ్‌కు ముందు స్పందిస్తానని అన్నాడు. 90 మైల్స్ స్పీడ్ అసలు ప్రాబ్లమే కాదని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఎంతో మంది 90 మైల్స్ బౌలర్లను ఎదుర్కొన్నానని అన్నాడు.

టీ20 స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన తైమాల్ మిల్స్ గంటలకు 144 కిలోమీట్ల వేగంతో బంతులను సంధించగలడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున 2016లో శ్రీలంకపై ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. గాయం తిరిగి పెట్టడంతో గత రెండు సంవత్సరాలుగా రెడ్ బంతి క్రికెట్‌కు దూరమైన మిల్స్ పరిమిత ఓవర్ల ఆటలో రాణిస్తున్నాడు.

గురువారం నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. ఈ టీ20 సిరిస్‌లో మిల్స్ రాణిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా కాంట్రాక్టు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. మిల్స్‌కు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీ20 లీగ్స్‌లో ఆడిన అనుభవం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X