న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ విజయంలో జయంత్ పాత్ర: కోహ్లీ ప్రశంస

By Nageshwara Rao

విశాఖపట్నం: రెండో టెస్టులో ఇంగ్లాండ్‌‌పై టీమిండియా 246 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో కెప్టెన్ కోహ్లీ బాధ్యాయుత ఇన్నింగ్స్ ఆడగా, భారత బౌలర్లు ముఖ్యంగా స్ఫిన్నర్లు సత్తా చాటారు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరగేట్రం చేసిన జయంత్ యాదవ్ తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ఫోటోలు

ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. జయంత్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బంది పడతారనే విషయం తనకు తెలుసని కోహ్లీ చెప్పాడు. అరంగేట్రం టెస్టులోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడని, తన పట్ల తాను హ్యాపీగా ఉన్నట్టు కోహ్లీ తెలిపాడు.

Virat Kohli praises debutant Jayant Yadav for 'priceless' contributions

బౌలింగ్ చేస్తున్నప్పుడు తానేం చేస్తున్నాడో తనకు తెలుసని, ఏ యాంగిల్‌లో బౌలింగ్ వెయ్యాలి, ఎక్కడెక్కడ ఫీల్డింగ్ పెడితే వికెట్లు పడే అవకాశాలున్నాయో మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనతో చర్చించాడని కోహ్లీ తెలిపాడు. అంతేకకాదు బౌలింగ్ సమయంలో తన వేగాన్ని జయంత్ యాదవ్ నియంత్రించుకోగలడని కోహ్లీ అన్నాడు.

రెండో టెస్టులో వికెట్లు తీయగలిగే ఐదురుగు బౌలర్లు ఉండటం కలిసొచ్చిందని కోహ్లీ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 158 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది.

భారత్ 1-0: విశాఖ టెస్టులో ఐదో రోజు ఆట సాగిందిలాభారత్ 1-0: విశాఖ టెస్టులో ఐదో రోజు ఆట సాగిందిలా

తన అరంగేట్రం టెస్టులోనే భారత స్పిన్నర్ జయంత్ యాదవ్ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేయడంతో పాటు, వికెట్ తీసిన జయంత్ ఫీల్డింగ్‌లో కూడా రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 200 దాటడంలో ముఖ్య భూమిక పోషించిన జయంత్ యాదవ్ చివరి వరకూ క్రీజులో నిలబడి 27 పరుగులు చేశాడు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11.3 ఓవర్లు పాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో నాలుగు మెడిన్ ఓవర్లు ఉండటం విశేషం. కాగా రెండో టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కోహ్లీ అందుకున్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో మెరిశాడు. దాంతో ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లీ 248 పరుగులు నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X