న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెయిల్ లభించింది: ఎట్టకేలకు కోహ్లీ పాక్ అభిమానికి విముక్తి

By Nageswara Rao

ఇస్లామాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్‌కు చెందిన వీరాభిమాని అయిన ఉమెర్ డరాజ్‌కు బెయిల్ లభించింది. శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒకారా అడిషనల్ డిస్టిక్ట్, సెషన్స్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది.

జనవరి 25న డరాజ్ పాకిస్థాన్‌లోని తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురువేసినందుకు అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే అతడి కేసుని విచారించిన కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానంతోనే భారత్ జెండాను ఎగురవేశానని, ఇలా చేయడం నేరమని తనకు తెలియదని కోర్టుకు విన్నవించుకున్నాడు.

Virat Kohli's Pakistani fan Umar Daraz gets bail

ఈ నెల 18వ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి అనీఖ్ అన్వర్ బెయిల్ మంజారు చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత మళ్లీ శనివారం కేసుని విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టును ఆశ్రయించగా రూ. 50 వేల పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల ఆస్టేలియా-భారత్‌ల మధ్య అడిలైడ్‌లో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌‌లో విరాట్ కోహ్లి అజేయంగా 90 పరుగులు చేయడంతో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో డరాజ్ తన ఇంటిపై భారత్ జెండా ఎగరవేసి కోహ్లీపై ఉన్న అభిమానం చాటుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X