న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెటర్లలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మైగ్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో మార్మోగుతోంది. వివరాల్లోకి వెళితే, ట్విట్టర్లో ఇప్పుడో ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్న ఓ యువకుడు అచ్చం విరాట్ కోహ్లీలానే ఉన్నాడు.
పాకిస్ధాన్ క్రికెట్ జట్టు జెర్సీ ధరించి, కోహ్లీ తరహాలో కళ్లు పెద్దవి చేసి తదేకంగా చూస్తున్నాడు. అతడు మాత్రం పాకిస్ధాన్‌కు చెందిన యువకుడు. పేరు మాత్రం తెలియరాలేదు. కానీ, ఇప్పుడతడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. పాకిస్ధాన్ జట్టులో కోహ్లీ లాంటి ఆటగాడు లేడని బాధపడుతున్న వారికి ఇప్పుడు కోహ్లీ దొరికాడని కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ ఉన్న అతనికి టీవీ ఛాన్స్‌లు, యాడ్లలో నటించే అవకాశాలు వస్తున్నాయని పాక్ మీడియా ఒక కథనంలో తెలిపింది. కాగా, పాకిస్ధాన్లో విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తిని చూడటం ఇదే మొదటి సారి కాదు. పాకిస్ధాన్ జాతీయ క్రికెటర్ అహ్మాద్ షెహ్జద్ కూడా కోహ్లీలాగా ఉండటం విశేషం.