న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ అరుదైన రికార్డ్: 104 ఇన్నింగ్స్‌ల తర్వాత మళ్లీ ఇలా..

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరున మోదు చేసుకున్నాడు. 2014లో ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా కార్డిఫ్‌ వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు.

పుణె: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరున మోదు చేసుకున్నాడు. వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో నాలుగు ద్విశతకాలు.. దాదాపు ప్రతీ మ్యాచులో అతడి ఇన్నింగ్స్ కీలకమే. అయితే, పుణె వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ కోహ్లీ డకౌట్‌ అయ్యాడు.

డే2: ఆసీస్ 260: భారత్ 105కే ఆలౌట్: 2వికెట్లు కోల్పోయి నిలకడగా ఆసీస్ డే2: ఆసీస్ 260: భారత్ 105కే ఆలౌట్: 2వికెట్లు కోల్పోయి నిలకడగా ఆసీస్

క్రికెట్‌లో ఆటగాళ్లు డకౌట్‌ కావడం సాధారణమే అయినప్పటికీ కోహ్లీ డకౌట్‌ అయ్యాడంటే మాత్రం క్రికెట్‌ అభిమానులు అంత త్వరగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అతని ఆట అలా ఉంటుంది మరి.

Virat Kohli's rarest of rare record: Out for a duck after 104 innings

అసలు విషయలో వెళితే.. 2014లో ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా కార్డిఫ్‌ వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే అతడు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. అన్ని రకాల ఫార్మాట్లను కలుపుకుంటే 104 ఇన్నింగ్స్‌ల తర్వాత డకౌట్‌ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా, భారత జట్టులో కోహ్లీ ఒక్కడిని కట్టడి చేస్తే చాలు మ్యాచ్‌ మనదే అని ప్రత్యర్థి జట్లు భావించేలా తయారైంది ఇప్పటి భారత జట్టు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ డకౌట్ కావడంతో కేఎల్ రాహుల్ అర్ధ శతకం మినహా మిగితా ఆటగాళ్లు ఎవరూ కూడా పెద్దగా రాణించకపోవడం గమనార్హం. దీంతో కేవలం 105 పరుగులకే భారత్ ఆలౌట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X