న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏదో ఒకరోజు నీ అంత వేగంగా పరుగెత్తుతా: ఉసేన్ బోల్ట్ ట్వీట్‌కు కోహ్లీ రిప్లై

By Nageshwara Rao

హైదరాబాద్: బ్యాట్‌తో మైదానంలో, బ్రాండింగ్‌లో బయట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి జమైకన్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ అభినందనలు తెలిపాడు. ప్రముఖ స్పోర్ట్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాతో విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఫోటోలు: కోహ్లీ వంద కోట్ల ఒప్పందం ఏంటో తెలుసా? ఫోటోలు: కోహ్లీ వంద కోట్ల ఒప్పందం ఏంటో తెలుసా?

జర్మనీకి చెందిన స్పోర్ట్స్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ పూమాతో ఎనిమిదేళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కోహ్లీకి బోల్ట్ శుభాకాంక్షలు తెలిపాడు. పూమాతో ఒప్పందం ద్వారా కోహ్లీ ఉసెన్‌బోల్ట్‌, అసఫా పోవెల్‌, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్‌ గిరౌడ్‌ల సరసన చేరాడు.

Virat Kohli thanks 'legend' Usain Bolt after joining him at Puma with Rs 100 crore deal

ఈ సందర్భంగా బోల్ట్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. 'గొప్ప అవకాశం కోహ్లి. మరింత ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఇదే సరైన సమయ'మని బోల్ట్‌ ట్వీట్‌ చేశాడు. బోల్ట్‌ అభినందనలు అందుకున్న కోహ్లీ ట్విట్టర్‌లో స్పందించాడు. 'ఏదో ఒకరోజు నీ అంత వేగంగా పరుగెత్తుతానని ఆశిస్తున్నా. థాంక్స్‌ లెజెండ్‌' అని కోహ్లీ రిప్లై ఇచ్చాడు.

పూమాతో ఒప్పందం ద్వారా దేశంలో ఒకే బ్రాండ్‌తో ఏకంగా రూ.100 కోట్ల ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఎనిమిది సంవత్సరాలకు గాను పూమాతో కోహ్లీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం కోహ్లీకి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇస్తుంది.

ఈ ఒప్పందం సందర్భంగా కోహ్లీ సోమవారం మాట్లాడుతూ పూమాతో చాలాకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్‌లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు సరసన తాను చేరడం గౌరవంగా ఉందని అన్నాడు.

Virat Kohli thanks 'legend' Usain Bolt after joining him at Puma with Rs 100 crore deal

కాగా, స్పోర్ట్స్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ అయిన అడిడాస్‌తో 2013లో కోహ్లీ ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్‌ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తాజా ఒప్పందంతో సచిన్‌ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత వివిధ స్పోర్ట్స్‌, ఏజెన్సీల ఒప్పందాలతో కలిపి కోహ్లీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. కానీ కోహ్లీ మాత్రం కేవలం ఒకే బ్రాండుకు ఇంత భారీ మొత్తానికి ఒప్పందం చేసుకోవడం భారత క్రీడాకారుల చరిత్రలో ఇదే తొలిసారి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X