న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాశ్మీరి వ్యక్తిని జీపు బానెట్‌కు కట్టిన ఆర్మీ ఆఫీసర్‌కు సెహ్వాగ్ ప్రశంస

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు. ఇంతకీ ఎవరీ మేజర్‌ నితిన్‌ గొగోయ్‌. కాశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన వ్యక్తి.

Virender Sehwag's Special Message For Officer Who Tied Man To Army Jeep

ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఆ సయమంలో మేజర్‌ గొగోయ్‌ అప్పటికప్పుడు ఓ కాశ్మీరిని జీపు బానెట్‌కు కట్టి ఆందోళన కారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేశారు.

దీంతో నిరసనకారులు రాళ్లు రువ్వడం ఆపేశారు. దీంతో ఆ మార్గంలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, వారి వాహనాలు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందుకి వెళ్లాయి. మేజర్ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా సమర్ధించారు.

అంతేకాదు నితిన్‌కు కమెండేషన్‌ కార్డు మెడల్‌ కూడా అందజేశారు. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో స్పందించారు. 'కమెండేషన్‌ కార్డు మెడల్‌ పొందిన మేజర్‌ నితిన్‌ గొగోయ్‌కు అభినందనలు. మన సైనికులను కాపాడేందుకు, గొప్పగా విధులు నిర్వర్తించేలా ఎంతో గొప్పగా కృషి చేశారు' అంటూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X