న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అగార్కర్ 39: నవ్వొచ్చింది, సెహ్వాగ్ పంచ్ ట్వీట్ ఇదే

అజిత్ అగార్కర్ ఆదివారం (డిసెంబర్ 4) నాడు 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు అగార్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఆదివారం (డిసెంబర్ 4) నాడు 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు అగార్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన సహచర క్రికెటర్లకు వినూత్న శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, అజిత్ అగార్కర్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెహ్వాగ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.

Virender Sehwag trolls birthday boy Ajit Agarkar, calls him 'Modern Day Aryabhatt'

అంతర్జాతీయ క్రికెట్‌లో అజిత్ అగార్కర్ సాధించిన విజయాలను హైలెట్ చేస్తూ సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో

పుట్టినరోజు శుభాకాంక్షలు
191 వన్డేల్లో 288 వికెట్లు పెద్ద విజయం
లార్డ్స్ మైదానంలో 100 పెద్ద విజయం
వరుసగా ఐదు టెస్టుల్లో డకౌట్ పెద్ద విజయం అంటూ అగార్కర్‌ను మోడరన్ డే ఆర్యభట్టాగా అభివర్ణించాడు.

2013లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అగార్కర్ భారత్ తరుపున అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో అగార్కర్ టెస్టుల్లో సెంచరీని సాధించాడు. భారత్ తరుపున 26 టెస్టు మ్యాచ్‌లాడిన అగార్కర్ 58 వికెట్లు తీసుకున్నాడు.

2003లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదిలాడుతూనే ఉంటుంది. అగార్కర్ వన్డేల్లో భారత్ తరుపున ఓపెనింగ్ బ్యాట్స్ మెన్‌గా కూడా రాణించాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 95. యావరేజి 80.62.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X