న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గల్లీ క్రికెట్: గంగూలీ భుజాన్ని తాకిన బంతి (వీడియో)

గంగూలీ గల్లీ క్రికెట్‌ ఆడుతూ కనిపించాడు. ఉత్తర కోల్‌కతాలోని ఓ చిన్న గల్లీలో అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడిన దాదా తన చూడముచ్చటైన షాట్లతో అలరించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: సౌరభ్ గంగూలీ. భారత క్రికెట్‌లో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. అభిమానులు ముద్దుగా 'దాదా' అని పిలుచుకునే గంగూలీ తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బిజీగా ఉన్నాడు. కెప్టెన్‌గా టీమిండియాకు దూకుడుగా నేర్పించిన గంగూలీ తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా బ్యాటు పట్టుకొని గల్లీ క్రికెట్ ఆడతాడు.

Sourav Ganguly injures his shoulder while playing gully cricket

తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్‌ ఆడుతూ గంగూలీ కనిపించాడు. ఉత్తర కోల్‌కతాలోని ఓ చిన్న గల్లీలో అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడిన దాదా తన చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఇంతలో ఓ బాల్‌ దూసుకొచ్చి ఆయన గంగూలీ భుజానికి గట్టిగా తాకింది.

అయితే టెన్నిస్ బంతి కావడంతో గంగూలీ గాయమేమీ కాలేదు. చేతిని సరిచేసుకుని మళ్లీ గంగూలీ క్రికెట్‌ ఆడాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌‌కు రిటైరయి పోయి ఎనిమిదేళ్లవుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X