న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇద్దరు సెంచరీలు, ఇంగ్లాండ్‌పై లంక భారీ విజయం.. నాకౌట్ అశలు సజీవం

By Nageswara Rao

వెల్లింగ్టన్: ఐసీసీ వరల్డ్ కప్‌ పూల్ ఎలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 310 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక... తరిమన్నే(139 నాటౌట్‌), కుమార సంగక్కర(117 నాటౌట్‌) సెంచరీలతో రాణించండతో 16 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 312 పరుగులు చేసింది.

ఈ విజయంలో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా మూడు సార్లు ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్లో శ్రీలంక-ఇంగ్లాండ్ జట్లు 10 సార్లు తలపడగా, 6 సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించగా, 4 సార్లు శ్రీలంక విజయం సాధించింది.

WC 2015: Sri Lanka win 3rd consecutive match against Eng at WC, trail 4-6 now

ఇంగ్లాండ్‌పై సాధించిన విజయంతో శ్రీలంక నాకౌట్ దశకు చేరువైంది. ఇంగ్లాండ్ ఓడిపోవడంతో నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. వన్డేల్లో అంతర్జాతీయ కెరీర్‌లో కుమార సంగక్కర 23వ సెంచరీ నమోదు చేయగా, తిరుమన్నే మూడవ సెంచరీని నమోదు చేశారు.

ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అలీ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో రూట్ (121) సెంచరీని నమోదు చేయగా, ఇయాన్ బెల్ (49) పరుగు తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ, మాథ్యూస్, దిల్షాన్, హెరాత్, పెరెరా, లక్మల్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X