న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ ఫైనల్లో మిథాలీ సేన ఓటమికి అసలు కారణం ఇదీ

By Nageshwara Rao

హైదరాబాద్: ఆఖర్లో ఒత్తిడికి గురయ్యామని అందుకే పైనల్లో ఓటమి పాలయ్యామని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంగీకరించింది. మ్యాచ్ అనంతరం మిథాలీ రాజ్ మాట్లాడుతూ లక్ష్య ఛేదనలో ఒత్తిడికిగురై ఓటమిపాలయ్యామని పేర్కొంది.

ఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేనఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేన

అయితే వరల్డ్ కప్ టోర్నీలో తాము గర్వంగా ముగించామని పేర్కొంది. జట్టులోని యువ క్రీడాకారిణులు శక్తిమేరకు పోరాడారని, టోర్నలోని ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్లకు సవాల్ విసిరారని తెలిపింది. అలాంటి యువ క్రికెటర్లను చూసి గర్విస్తున్నానని పేర్కొంది.

అను భవజ్ఞురాలైన పేసర్‌ జులన్‌ గోస్వామి జట్టుకు అవసరమైన అన్ని సమయాల్లో రాణించిందని ప్రశంసించింది. ఫైనల్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది మహిళా క్రికెటర్లకు ఉత్తేజాన్నిస్తుందని మిథాలీ అభిప్రా యపడింది.

 We panicked in the end: Mithali Raj

మిథాలీకి బంపర్ ఆఫర్: సచిన్ చేతుల మీదగా బీఎండబ్ల్యూ కారుమిథాలీకి బంపర్ ఆఫర్: సచిన్ చేతుల మీదగా బీఎండబ్ల్యూ కారు

ఈ అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక తన భవిష్యత్‌ గురించి మాట్లాడుతూ 'కచ్చితంగా మరో రెండేళ్లు ఆడతా. అయితే వచ్చే వరల్డ్‌కప్‌లో మాత్రం ఆడబోను' అని మిథాలీ రాజ్ స్పష్టం చేసింది.

ఆఖరివరకూ నిలిచి, రన్‌రేట్‌ను ఓవర్‌కు అయిదు లేదా ఆరు పరుగుల వరకూ తీసుకొస్తే తమ విజయం ఖాయమని భావించినట్టు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ చెప్పింది. మిథాలీసేన పట్టుదలతో ఆడిందని అభినందిస్తూ వారికి ఈ టోర్నీ ఎంతో గొప్పగా మిగిలిపోతుందని ఆమె పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X