న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ! ఆటోమేటిక్ ఛాయిస్ కాదు: విమర్శలపై ఎంఎస్‌కే ఆగ్రహం

న్యూఢిల్లీ: ఐదు వన్డేల శ్రీలంక సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయడాన్ని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ సమర్థించుకున్నాడు. అతని ఎంపికలో ఎటువంటి తప్పుజరగలేదని అంతా తెలుసుకోవాలని అన్నాడు. ధోనీని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఎంపిక చేశారంటూ కొందరు విమర్శించడంతో ప్రసాద్ ఘాటుగా స్పందించాడు.

ధోనీ ఎంపిక ఆటోమేటిక్ ఛాయిస్ కాదని, 2019 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకునే ఎంపిక జరిగిందని స్పష్టం చేశాడు. ధోనీని ఎంచుకునే విషయంలో టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ ఆగస్లీ గణాంకాలపై చర్చించామని, ఆగస్సీ కెరీర్ 30ఏళ్లు దాటిన తర్వాత ప్రారంభమైందని గుర్తు చేశాడు.

We Will Look at Alternatives if MS Dhoni Doesn't Deliver: MSK Prasad

అంతేగాక, ఆగస్సీ కెరీర్ చివరి దశలో ఎన్నో టైటిల్స్ గెలిచి స్ఫూర్తిదాయకంగా నిలిచాడని తెలిపాడు. ప్రస్తుతం ధోనీని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఎంపిక చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఎంపిక జరిగిందని వివరించాడు.

రాబోయే మ్యాచ్ ల్లో అతను ఎలా ఆడతాడో చూడండి.. అయితే, రిషబ్ పంత్‌కు టీ20ల్లో అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. హార్ధిక్ పాండ్యాను కూడా ఇలానే తొలుత ఎంపిక చేశామని, రిషబ్ పంత్ విషయంలో అలానే జరుగుతుందన్నాడు. ధోనీ ఎంపిక తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరోసారి తేల్చి చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X