న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ డబుల్ సెంచరీ చేసింది ఇదే రోజు, ఆరోజు ఆయన నిద్రపోలేదు, కారణమదేనా?

వన్ డేలలో తొలిసారి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డులకెక్కాడు. ఏడేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ ఈ సరిగ్గా ఇదే రోజున ఈ రికార్డును క్రియేట్ చేశాడు.

By Narsimha

ముంబై:వన్డే లలో తొలిసారిగా డబుల్ సెంచరీని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇదే రోజున చేశాడు. ఏడేళ్ళ క్రితం దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్ లో రెండువందల పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు సచిన్ టెండూల్కర్. ఆ రోజున ఆయనకు నిద్రే పట్టలేదంట. ఈ మేరకు తన ఆత్మకథలో ఈ విషయాన్ని ఆయన రాసుకొన్నాడు.

దక్షిణాఫ్రికాతో గ్వాలియార్ లో ఇండియా వన్ డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచాడు. సచిన్ డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.

సచిన్ డబుల్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డు సాధించడమే కాకుండా జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు అందుకొన్నారు.

Why Sachin Tendulkar Couldn't Sleep After Scoring 1st ODI 200

డబుల్ సెంచరీ సాధించిన రోజున ఆయన తీవ్రంగా అలసిపోయాడట. కానీ, డబుల్ సెంచరీ సాధించనందుకుగాను సచిన్ ను ఆయన స్నేహితులు ప్రశంసలతో ముంచెత్తారు.

సచిన్ ను అభినందిస్తూ విపరీతంగా ఫోన్లు వచ్చాయంట. రెండు గంటలకు పైగా తనకు వచ్చిన మేసేజ్ లకు ఆయన రిప్లయ్ ఇస్తూనే గడిపాడంట.ఆ రోజంతా తనకు నిద్రపట్టలేదని సచిన్ చెప్పాడు.

తన ఆత్మకథ ప్లేయింట్ ఇట్ మై వే లో సచిన్ ఈ విషయాన్ని రాసుకొన్నాడు.సచిన్ ర్వాత వన్ డేలలో రెండు వందల పరుగుల మైలు రాయిని దాటిన వారిలో రోహిత్ శర్మ, మార్టిన్ గుఫ్రిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ ఉన్నారు. రోహిత్ శర్మ రెండు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X