న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఈడెన్ పిచ్ తవ్వి పడేస్తాం'

By Srinivas

కోల్‌కతా: ట్వంటీ 20 ప్రపంచ కప్‌కు బెదిరింపులు వస్తున్నాయి! పాకిస్తాన్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో భారత్ మ్యాచ్ జరిగితే.. తాము పిచ్‌ను తవ్వేస్తామని భారత్ తీవ్రవాద వ్యతిరేక దళం (యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) చెబుతోంది.

పాకిస్తాన్ - భారత్ మధ్య మ్యాచ్ ఉంటే కనుక తాము తప్పకుండా ఈడెన్ పిచ్ తవ్వేస్తామని బుధవారం నాడు హెచ్చరించింది. ముంబై, పఠాన్‌కోట్, తాజా పాంపోర్ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, కాబట్టి పాక్‌తో మ్యాచ్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పింది.

భారత్‌లో పాకిస్తాన్ మ్యాచ్ అంటే... తీవ్రవాదుల దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించే మన సైనికులను అవమానించడమేనని పేర్కొంది. తీవ్రవాదుల దాడి నేపథ్యంలో మృతి చెందిన సైనికులను కూడా అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు.

Will dig up Eden Gardens pitch if Pakistan plays World T20: Anti-Terrorist Front of India

ఎట్టి పరిస్థితుల్లో తాము మ్యాచ్‌ను జరగనివ్వమని చెప్పారు. ఈడెన్ పిచ్ తవ్వేస్తామని, ఈడెన్ గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వీరేష్ శాండిల్యా హెచ్చరించారు. కాగా, ఆ సంస్థ సభ్యులు ఏం చేయాలనే దానిపై సమావేశమయ్యారు.

కాగా, భారత్‌, పాకిస్థాన్‌ ట్వంటీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆతిథ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే. ధర్మశాలలో భద్రత కల్పించేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తిరస్కరించడంతో ఐసిసి మ్యాచ్‌ వేదికను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌కు మార్చింది.

ప్రపంచకప్‌ ఆరంభ దశలో పాకిస్థాన్‌ జట్టు కోల్‌కతా కేంద్రంగా ఉంటుంది. భద్రత కారణాల వల్ల భారత్‌, పాకిస్థాన్‌ ట్వంటీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ వేదికను కోల్‌కతాకు మార్చామని, మ్యాచ్‌ అదే తేదీన, అదే సమయానికి (మార్చి 19, రాత్రి 7.30) ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతుందని ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డేవ్‌ రిచర్డ్‌సన్‌ బుధవారం విలేకర్ల సమావేశంలో చెప్పాడు. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X