న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5 వికెట్లు: టెస్టు దిగ్గజాల సరసన అశ్విన్ (ఫోటోలు)

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకుని 67 పరుగులిచ్చాడు. దీంతో అశ్విన్ టెస్టు దిగ్గజాల సరసన చేరాడు.

By Nageshwara Rao

విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు వికెట్లు తీసుకుని అరుదైన ఘనతను సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకుని 67 పరుగులిచ్చాడు. దీంతో అశ్విన్ టెస్టు దిగ్గజాల సరసన చేరాడు.

రెండో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగలకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ జట్టు 255పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించడానికి గాను అశ్విన్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు.

దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ హ్యాట్రిక్ వికెట్లు దక్కించుకునే అవకాశం పొందాడు. రెండో టెస్టులో అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకోవడంతో టెస్టు దిగ్గజాల సరసన చేరాడు.

(ఒకే ఇన్నింగ్స్‌లో 22 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు) తీసిన టెస్టు దిగ్గజాలు వకార్ యునిస్ (పాకిస్థాన్), మాల్కోమ్ మార్షల్, ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్స్ (ఈ ముగ్గురు వెస్టిండిస్‌కు చెందినవారు) సరసన ఇప్పుడు అశ్విన్ చేరాడు. కెరీర్‌లో 41వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌లో అందుకున్న మైలు రాళ్లలో ఇదొకటి.

ఇంగ్లాండ్‌తో ముగిసిన తొలి ఇన్నింగ్స్ అనంతరం అశ్విన్ టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 228 వికెట్లు తీసుకున్నాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా 5 వికెట్లు తీసుకున్న బౌలర్లలో శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ ఉన్నాడు. టెస్టుల్లో 67 సార్లు 5 వికెట్లను ముత్తయ్య మురళీ ధరన్ తీసుకున్నాడు.

ఇక భారత జట్టు వస్తే ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే 35 సార్లు 5 వికెట్లను పడగొట్టాడు. అశ్విన్ మరోసారి 5 వికెట్లను తీసుకుంటే మాజీ క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్ (ఇండియా) ఇమ్రాన్ ఖాన్ (పాకిస్థాన్), డెన్నిస్ లిల్లీ (ఆస్ట్రేలియా)ల రికార్డుని సమం చేస్తాడు.

Most 5-wicket hauls in Test cricket (As on November 19, 2016)
67 - Muttaiah Muralitharan (Sri Lanka)
37 - Shane Warne (Australia)
36 - Richard Hadlee (New Zealand)
35 - Anil Kumble (India)
29 - Glenn McGrath (Australia)
28 - Rangana Herath (Sri Lanka)
27 - Ian Botham (England)
26 - Dale Steyn (South Africa)
25 - Wasim Akram (Pakistan), Harbhajan Singh (India)
24 - Sydney Barnes (England)
23 - Dennis Lillee (Australia), Imran Khan (Pakistan), Kapil Dev (India)
22 - Ravichandran Ashwin (India), Waqar Younis (Pakistan), Malcolm Marshall, Curtly Ambrose, Courtney Walsh (all West Indies)

 సక్సెస్‌పుల్ అప్పీల్

సక్సెస్‌పుల్ అప్పీల్

2011లో వెస్టిండిస్ జట్టుపై ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 41 టెస్టు మ్యాచ్‌లాడాడు.

 నెంబర్ వన్ స్ఫిన్నర్

నెంబర్ వన్ స్ఫిన్నర్

ప్రస్తుతం భారత్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్పిన్నర్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ సిరిస్‌లో అశ్విన్ మొత్తం 27 వికెట్లు తీసుకున్నాడు.

 పండుగ వేళ

పండుగ వేళ

ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ వేసిన బంతికి వికెట్ పడిన సందర్భంలో పండుగ చేసుకుంటున్న వేళ.

 క్లీన్ బౌలింగ్ యాక్షన్

క్లీన్ బౌలింగ్ యాక్షన్

టెస్టు క్రికెట్‌ స్పిన్నర్లలో క్లీన్ బౌలింగ్ యాక్షన్ కలిగిన అతికొద్ది మంది స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు.

 అశ్విన్‌కు జడేజా సలహా

అశ్విన్‌కు జడేజా సలహా

టీమిండియాలో సీనియర్ స్ఫిన్నర్ అయినప్పటికీ రవీంద్ర జడేజా సలహాల తీసుకుంటున్న అశ్విన్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్ నైజం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X