న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండిస్ or ఇంగ్లాండ్: ఈడెన్‌లో చరిత్ర సృష్టించేదెవరు?

By Nageswara Rao

కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 3)న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అది చరిత్ర సృష్టిస్తుంది. టైటిల్ రేసు కోసం పైనల్ మ్యాచ్‌లో వెస్టిండిస్-ఇంగ్లాండ్ జట్లు కోల్‌కత్తాలో తలపడనున్నాయి.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరైనా విజయం సాధిస్తుందో ఆ జట్టు రెండోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ టీ20 టైటిల్‌ను ఏ జట్టు కూడా రెండు సార్లు గెలుపొందలేదు. కాగా, ప్రస్తుతం టైటిల్ బరిలో నిలిచిన వెస్టిండిస్, ఇంగ్లాండ్ జట్లు గతంలో ఒక్కసారి మాత్రమే ఛాంపియన్‌గా అవతరించాయి.

ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, వెస్టిండిస్ జట్టుకు డారెన్ సామీ నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. సూపర్ 10 స్టేజిలో ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ అద్భుతమైన సెంచరీని సాధించడంతో ఇంగ్లాండ్‌పై వెస్టిండిస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2010తో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 2012లో శ్రీలంకపై విజయం సాధించి వెస్టిండిస్ జట్టు వరల్డీ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది.

 World T20 Final: Who will create history in Kolkata - West Indies or England?

వరల్డ్ T20 ఛాంపియన్స్:

2007 - India
2009 - Pakistan
2010 - England
2012 - West Indies
2014 - Sri Lanka
2016 - ?

జట్లు:

ఇంగ్లాండ్: Eoin Morgan (captain), Alex Hales, Jason Roy, Joe Root, Eoin Morgan, Jos Buttler (wicketkeeper), Moeen Ali, Adil Rasheed, Chris Jordan, David Willey, Liam Plunkett, James Vince, Reece Topley, Liam Dawson, Sam Billings.

వెస్టిండిస్: Darren Sammy (captain), Samuel Badree, Sulieman Benn, Carlos Brathwaite, Dwayne Bravo, Johnson Charles, Lendl Simmons, Chris Gayle, Jason Holder, Evin Lewis, Ashley Nurse, Denesh Ramdin (wicketkeeper), Andre Russell, Marlon Samuels, Jerome Taylor.

మ్యాచ్ సాయంత్రం ప్రారంభం: 7 PM IST (Live on Star Sports)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X