న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టఫ్: ధోనిసేన సెమీస్‌కు వెళ్లాలంటే... సండేనే కీలకం

By Nageswara Rao

బెంగుళూరు: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా బెంగుళూరులో బంగ్లాదేశ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో విజయం సాధించిన టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ క్రమంలో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడి నాలుగు పాయింట్లు సాధించింది. అయితే ఆదివారం మొహాలిలో ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అంతేకాదు ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నెట్ రన్ రేటు కూడా చాలా ముఖ్యం.

World T20: How MS Dhoni-led India can make the semi-finals?

టీమిండియా సెమీస్‌లోకి ప్రవేశించాలంటే ఉండే ఏయే మార్గాలున్నాయో ఒక్కసారి చూద్దాం:

Scenario 1:
మార్చి 25(శుక్రవారం)న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైతే సెమీస్ ఆ జట్టు నుంచి వైదొలగుతుంది. ఇదే సమయంలో మొహాలీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి నెట్ రన్ రేట్ అవసరం లేకుండా టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అదే ఆస్టేలియా విజయం సాధిస్తే 6 పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది.

Scenario 2:
ఇక గ్రూప్-2 నుంచి సెమీస్‌లోకి ప్రవేశించే రెండో జట్టు కోసం ఆసీస్-భారత జట్ల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఒకవేళ శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్టేలియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తే, భారత్‌కు ఇబ్బందే. అంతేకాదు ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఆస్టేలియాపై భారత్ విజయం సాధించినా.... ఈ మాడు జట్లు తలో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్లు అవుతుంది. అప్పుడు సెమీస్‌కు మూడు జట్లు నెట్ రన్ రేట్‌పై ఆధాపడతాయి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్ రేట్ (-0.546) ఉండగా, పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి.

Scenario 3:
ఒకవేళ భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లు వర్షం కారణంగా నిలిచిపోతే... టీమిండియా 5 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఫైనల్‌గా భారత్ సెమీస్‌కు చేరాలంటే:

పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవాల్సి ఉంది
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాల్సి ఉంది.

నిజానికి ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీకి ముందు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిస్థాయిలో ఆడటం లేదు. టోర్నీలో న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు కూడా భారత్ స్థాయికి తగినవిగా లేవు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతుంది.

ప్రస్తుతం ఆయా జట్ల నెట్ రన్ రేట్ (NRR)
1. New Zealand - 6 points (3 games) (NRR +1.283)
2. India - 4 points (3 games) (-0.546)
3. Pakistan - 2 points (3 games) (+0.254)
4. Australia - 2 points (2 games) (+0.108)
5. Bangladesh - 0 points (3 games) (-1.165)

Group 2 లో మిగితా మ్యాచ్‌ల వివరాలు:
(March 25) - Australia Vs Pakistan (3 PM IST) in Mohali Saturday
(March 26) - New Zealand Vs Bangladesh (3 PM IST) in Kolkata Sunday
(March 27) - India Vs Australia (7.30 PM IST) in Mohali
Already qualified for semi-finals - New Zealand (3 wins out of 3 - 6 points)
Out of semi-final race - Bangladesh (3 losses out of 3)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X