న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచ కప్: కివీస్‌ చేతిలో భారత్ చిత్తు

By Pratap

నాగపూర్: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా న్యూజిలాండ్‌పై మంగళవారం జరిగిన మ్యాచులో భారత్ చిత్తుగా ఓటమి పాలైంది. ఓటమిని అడ్డుకునేందుకు కెప్టెన్ ధోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. 47 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. నెహ్రా డకౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్సు ముగిసింది.

కివీస్ తమ ముందు ఉంచిన 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకు చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సాంత్నార్ నాలుగు వికెట్లు తీయగా సోథీ మూడు వికెట్లు తీశాడు. మెక్‌కుల్లంకు రెండు వికెట్లు, మిల్నేకు ఓ వికెట్ లభించాయి.

న్యూజిలాండ్ తన ముందు ఉంచిన 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఐదు పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ ఒక్క పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

World T20: New Zealand opt to bat first against India

దూకుడుగా ఆడే ప్రయత్నంలో భారత కెప్టెన్ ధోనీ అవుటయ్యాడు. దీంతో భారత్ 79 పరుగుల స్కోరు వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ధోనీ 30 పరుగులు చేసి సాంత్నార్ బౌలింగులో అవుటయ్యాడు.

73 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ సోధీ బౌలింగులో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

న్యూజిలాండ్ బౌలర్ల ముందు భారత్ బ్యాట్స్‌మెన్ నిలదొక్కులేకపోతున్నారు. 42 పరుగులకే భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. సోధీ విరాట్ కోహ్లీని అవుట్ చేయగా, సాంత్నర్ హార్దిక్ పాండ్యాను పెవిలియన్‌కు పంపించాడు. కోహ్లీ, పాండ్యా ఔట్: 43 పరుగులకే ఏడో వికెట్ డౌన్

యువరాజ్ సింగ్ భారత అభిమానులను నిరాశ పరిచాడు. దాంతో భారత్ 26 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మెక్‌కుల్లం బౌలింగులో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ సింగ్ అవుటయ్యాడు.

World T20: New Zealand opt to bat first against India

12 పరుగులకే భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా ఒక్క పరుగు మాత్రమే చేసి సాంత్నర్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ కష్టాల్లో పడింది. పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ కేవలం ఐదు పరుగులు చేసిన సాంత్నర్ బౌలింగులో వెనుదిరిగాడు.

ట్వంటీ ప్రపంచ కప్ పోటీల్లో మంగళవారంనాటి మ్యాచులో భారత్‌పై న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో కివీస్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అశ్విన్, నెహ్రా, సురేష్ రైనా, బుమ్రాహ్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. ఇద్దరు కివీస్ బ్యాట్స్‌మన్ రన్నవుట్ అయ్యారు.

న్యూజిలాండ్ మీద ప్రపంచ కప్ ట్వంటీ20 మ్యాచులో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలి ఓవర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో వేయించాడు. తొలి బంతికి సిక్సర్ బాదిన గుప్తిల్ రెండో బంతికి అవుటయ్యాడు.

న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 113 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఇలియోట్ 9 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు.

World T20: New Zealand opt to bat first against India

న్యూజిలాండ్ 98 పరుగులు స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 16.4 ఓవర్ల వద్ద జడేజా బౌలింగులో అవుటయ్యాడు.

కివీస్ 89 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రాహ్ బౌలింగులో 15.4 ఓవర్ల వద్ద 34 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

కివీస్ 61 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రాస్ టైలర్ 11.3 ఓవర్ల వద్ద 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రన్నవుటయ్యాడు.

న్యూజిలాండ్ 35 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా బౌలింగులో విలియమ్సన్ 8 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

తర్వాతి ఓవరు ఆశిష్ నెహ్రా వేశాడు. న్యూజిలాండ్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మన్రో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరుగుతున్న తొలి మ్యాచులో భారత్‌పై న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కానే విలియమ్స్ టాస్ గెలిచాడు. టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఫేవరైట్‌గా నిలిచింది.

తొలి ప్రపంచ కప్‌ను భారత్ 2007లో దక్షిణాఫ్రికాను ఓడించి గెలుచుకుంది. గత నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో ఇప్పటి వరకు భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించలేదు.

జట్లు

భారత్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రాహ్, ఆశిష్ నెహ్రా, హర్బజన్ సింగ్, పవన్ నేగి, అజింక్యా రహనే, మొహమ్మద్ షమీ

న్యూజిలాండ్: కానే విలియమ్స్ (కెప్టెన్), మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోల్స్, ల్యూక్ రోంచి (వికెట్ కీపర్), రాస్ టైలర్, కోలిన్ మన్రో, మిచెల్ స్టాంటర్, నాథన్ మెక్‌కుల్లం, గ్రాంట్ ఇలియోట్, మిచెల్ మెహక్‌క్లెంగాన్, టిమ్ సౌథీ, ట్రెట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, కోరీ అండర్సన్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X