న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2007: ఈసారైనా కివీస్‌పై భారత్ విజయం సాధిస్తుందా?

By Nageswara Rao

నాగ్‌పూర్: 2007లో తొలిసారిగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఛాంపియన్‌గా అవతరించిన టీమిండియా, ఆ టోర్నమెంట్‌లో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. అలాంటి న్యూజిలాండ్‌తో టీమిండియా మళ్లీ మార్చి 15 (మంగళవారం) నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో తలపడతుంది.

ఈ టీ20 టోర్నీలో భాగంగా రెండోసారి ఈ ఇరు జట్లు ఈరోజు తలపడుతున్నాయి. 1-0 తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ పైచేయి సాధించింది. 2007లో తొలిసారి ఐసీసీ టీ20ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. 2007లో టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 16న జరిగిన దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ ఉన్న వాండరర్స్ స్డేడియంలో సూపర్ 8 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు మెక్‌కల్లమ్, మెక్‌మిలన్లు అద్భుతమైన స్కోరుతో అదరగొట్టారు. మెక్ కల్లమ్ 31 బంతుల్లో 45 పరుగులు, మెక్ మిలన్ 23 బంతుల్లో 44 పరుగులు సాధించారు. దీంతో 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది.

World T20: Two Macs gave New Zealand a win over India in 2007 edition

హార్భజన్ సింగ్ వేసిన నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లకు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు గౌతం గంభీర్ (33 బంతుల్లో 51 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (17 బంతుల్లో 40 పరుగులు) సాధించారు.

టీమిండియా 5.5 ఓవర్లలో 76 పరుగులు చేయగా ఒకానొక దశలో భారత్ తప్పక విజయం సాధిస్తుందన్నారు. ఈ సమయంలో జాకబ్ ఓరమ్ అద్భుతమైన బౌలింగ్ వేసి భారత్ టాప్ ఆర్డర్‌ను 128 పరుగులకే కుప్పకూల్చాడు. చివరి వికెట్ భాగస్వామికి ఆర్పీ సింగ్ 17 పరుగులు సాధించడంతో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది.

చివరకు 10 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డేనియల్ వెటోరీ 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నందుకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికీ పాయింట్ల పట్టికలో ముందుండటంతో సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X