న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సముద్రంపై ఎగరదు: హెలికాప్టర్ షాట్‌పై ధోనీ, సిక్స్‌లు కొట్టలేదని.. రిటైర్మెంట్‌పై చురక

By Srinivas

విశాఖపట్నం: పొట్టి క్రికెట్లో తాము ఎప్పుడు అందరికంటే ముందు ఉంటామని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. భారత్ మూడో ట్వంటీ 20లో విజయంతో సిరీస్‌ చేజిక్కించుకుని, నెంబర్ వన్‌ ర్యాంకును నిలబెట్టుకుంది. పొట్టి ప్రపంచకప్‌కు బలమైన ఫేవరెట్‌గా అవతరించింది.

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడాడు. మూడో వన్డేలో యువరాజ్ సింగ్‌కు బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి బ్యాటింగ్ అవకాశం రాలేదని చెప్పాడు. అయినప్పటికీ తాము అందరికి బ్యాటింగ్ కోసం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నాడు.

World T20: We are always top contenders in shorter formats, says MS Dhoni

6, 7 లేదా 8వ స్థానంలో వచ్చే వారు పెద్ద పెద్ద షాట్లు కొడితే అది జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. చివరలో బ్యాటింగ్‌కు వచ్చిన వారు తక్కువ బంతులు ఆడినప్పటికీ.. ఎక్కువ షాట్లు కొడితే జట్టుకు ఉపయుక్తమన్నాడు. 3 లేదా నాలుగు బంతులు ఆడినా 10, 15 పరుగులు చేస్తే అది లాభమే అన్నాడు.

షార్ట్ ఫార్మాట్లో భారతే అందరికంటే ముందుంటుందని చెప్పాడు. ప్రపంచ కప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో స్పీన్నర్స్ రాణించడం సంతోషకరమన్నాడు. ప్రమాదకరమైన శ్రీలంక బ్యాట్సుమెన్‌ను త్వరత్వరగా అవుట్ చేయడం తమకు కలిసి వచ్చిందని చెప్పాడు.

హెలికాప్టర్ షాట్స్ పైన, రిటైర్మెంట్ పైన ధోనీ

చాలాకాలంగా భారత్.. ముఖ్యంగా ధోనీ అభిమానులు హెలికాప్టర్ షాట్స్ కోసం వేచి చూస్తున్నారు. దీనిపై ధోనీ తనదైన శైలిలో స్పందించారు. సముద్రం పైన హెలికాప్టర్ ఎగరలేదని అన్నాడు. అలాగే, ప్రతి సమయంలోను హెలికాప్టర్ షాట్ కొట్టలేమని చెప్పాడు.

ప్రస్తుతం ప్రత్యర్థి జట్టు ప్రణాళికల నేపథ్యంలో ఆ షాట్ కొట్టడం కుదరదని చెప్పాడు. నేను కేవలం సిక్స్‌లు కొట్టడం లేదని... నా రిటైర్మెంట్ గురించి ఎవరూ అడగవద్దన్నాడు. నేను ఇప్పటికీ కెప్టెన్‌గా ఫిట్‌గదా ఉన్నానని చెప్పాడు. నేను మేనేజ్ చేస్తున్నప్పటికీ నా రిటైర్మెంట్ గురించి మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X