న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ క్రికెట్‌లోనే అరుదు: కుడి, ఎడమల పేసర్‌, ఎవరీ యాసిర్ జన్?

By Nageshwara Rao

లాహోర్: ధోని హెలికాప్టర్ షాట్‌కు పెట్టింది పేరు. రాహుల్ ద్రవిడ్ కవర్ డ్రైవ్‌ని పరిచయం చేశాడు. ఇలా ఎంతో మంది క్రికెటర్లు ఎన్నో సృజనాత్మక షాట్‌లను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశారు. అందులో స్విచ్‌ షాట్‌ లాంటివి ధనాధన్‌ క్రికెట్‌లో బాగా పాపులర్‌. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఒక్కసారిగా తన వాటాన్ని మార్చుకుని ఎడమ వైపుకు తిరిగి అనూహ్యంగా షాట్‌లు ఆడతాడు.

Yasir Jan: The Pakistan pacer who can knock your stumps bowling with either hand

అయితే బౌలర్లు మాత్రం కుడి లేదా ఎడమ ఏదో ఒక చేత్తోనే బంతులు వేస్తుంటారు. కానీ పాకిస్థాన్‌కు చెందిన యువ పేసర్ యాసిర్ జన్ (21) మాత్రం అందుకు భిన్నం. ఈ కుర్రాడి ప్రత్యేకత ఏంటంటే రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం. కుడి చేత్తో ఎంత వేగంగా బంతిని సంధిస్తాడో, ఎడమ చేత్తో కూడా అంతే వేగంతో బంతిని వేయగలుగుతాడు.

స్వతహాగా జన్‌ కుడి చేతి వాటం బౌలర్‌. ఈ చేత్తో గంటకు 145 కిమీ వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాగే ఎడమ చేత్తో 135 కిమీ స్పీడుతో బౌలింగ్‌ చేయగలగడం అతని ప్రత్యేకత. ఈ నైపుణ్యంతో యాసిర్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో చోటు సంపాదించాడు. లాహోర్‌ క్వాలండర్స్‌ జట్టు అతనికితో పదేళ్లకు ఒప్పందం చేసుకుంది.

పేదరికం నుంచి వచ్చినా తనకున్న ప్రత్యేక ప్రతిభతో క్రికెట్‌ ప్రపంచంలో సంచలనంగా మారాడు. గతంలో ఇదే ప్రతిభతో కొందరు వెలుగులోకొచ్చినా వారందరూ స్పిన్నర్లే. గతంలో అండర్‌-19 వరల్డ్‌క్‌ప్‌లో శ్రీలంక స్పిన్నర్‌ కమిందు మెండీస్‌ ఇలాంటి ఫీట్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.

ఇక భారత్‌లో విదర్భ క్రికెటర్‌ అక్షయ్‌ కర్నేవార్‌ కూడా రెండు చేతులతో బౌలింగ్‌ చేయగల సమర్థుడు. కానీ రెండు చేతులతో పేస్‌ బౌలింగ్‌ చేయగలిగిన తొలి క్రికెటర్‌గా యాసిర్‌ చరిత్ర సృష్టించాడు. నిజానికి ప్రపంచ క్రికెట్‌లో ఫలానా చేతితోనే బౌలింగ్ వేయాలనే నిబంధన ఏదీ లేదు.

యాసిర్ జన్ అండర్-19 మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు. రావల్పిండి అండర్‌-19 మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యర్ధి జట్టు గెలిచే సందర్భంలో జట్టు కెప్టెన్‌ యాసిర్‌ను తన బౌలింగ్ వాటంను మార్చమని కోరాడు. ఈ వ్యాహాం మ్యాచ్ ఫిలితాన్నే తారుమారు చేసింది. ఆ తర్వాత పాక్‌ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావెద్‌ నిర్వహించిన టాలెంట్‌ హంట్‌తో జన్ పేరు అందరికీ తెలిసింది.

యాసిర్ తండ్రి కూరగాయలు అమ్ముతాడు. కాగా, దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అంటే యాసిర్‌కు ఎంతో అభిమానం. జన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ కూడా స్టెయిన్‌ను పోలి ఉండటం విశేషం. 2009లో మహ్మద్‌ అమిర్‌ స్ఫూర్తితో యాసిర్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X