న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, ద్రవిడ్ రికార్డు బద్దలు: 35వ ఏట యూనిస్ ఖాన్ రికార్డు

By Nageshwara Rao

హైదరాబాద్: వెస్టిండిస్‌తో అబుదాబిలో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనతను సాధించాడు. 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతక ముందు ఈ రికార్డు భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌ల పేరిట ఉంది.

ఎక్కువ కాలంలో క్రికెట్‌లో కొనసాగిన సచిన్, ద్రావిడ్‌లు 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో 12 సెంచరీలు చేయగా, తాజాగా ఆ రికార్డుని యూనిస్ ఖాన్ అధిగమించాడు. 35 ఏళ్ల తర్వాత అత్యధికంగా టెస్టు సెంచరీలు చేసిన వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్‌, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, యూనస్ ఖాన్‌లు సమంగా ఉన్నారు.

అయితే అబుదాబిలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో యూనిస్ ఖాన్ ఆ రికార్డుని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో యూనిస్ ఖాన్ 127 పరుగులు చేశాడు. దీంతో 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం 39వ ఏళ్ల యూనిస్ ఖాన్ 33 టెస్టు సెంచరీలతో అత్యధిక సెంచరీల ఆటగాళ్ల జాబితాలో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహిళా జయవర్దనేలు 34 టెస్టు సెంచరీలతో యూనిస్ ఖాన్ కంటే ముందంజలో ఉన్నారు.

Younis Khan breaks record for most Test centuries after the age of 35

అంతేకాదు యూనిస్ ఖాన్ 90కి పైగా చేసిన పరుగులను 31 సెంచరీలుగా మలిచాడు. ఇది ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోలిస్తే ఎక్కువే. డాన్ బ్రాడ్‌మన్ 90కి పైగా పరుగులు సాధించిన క్రమంలో 29 సెంచరీలుగా మలిచాడు.

35 ఏళ్ల యూనిక్ ఖాన్ 3000కు పైగా పరుగులు చేసిన తొమ్మిదో బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. కాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్‌ 35 ఏళ్ల వయసు పైబడిన తర్వాత టెస్టుల్లో 4,563 పరుగులు సాధించాడు. యూనిస్ ఖాన్ నెలకొల్పిన మరో రికార్డు ఏంటంటే పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్‌తో కలిసి ఆ దేశ టెస్టు క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు నెలకొల్పారు.

వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకూ 3156 టెస్టు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అక్టోబర్ 22, 2016 నాటికి 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితా ఇదే:

No. పేరు ఆడిన టెస్టులు సెంచరీలు

1. Younis Khan (PAK) 30 13*
2. Rahul Dravid (IND) 47 12
3. Graham Gooch (ENG) 52 12
4. Sachin Tendulkar (IND) 53 12
5. Geoffrey Boycott (ENG) 45 10
6. Jack Hobbs (ENG) 33 10
7. Jacques Kallis (SA) 26 10
8. Steve Waugh (AUS) 40 10
9. Shivnarine Chanderpaul (WI) 43 9
10. Brian Lara (WI) 25 9

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X