న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదేశీ లీగ్‌: తొలి భారత క్రికెటర్‌గా యూసఫ్ పఠాన్‌

టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ హాంకాంగ్ కోవ్లాన్ కంటన్స్ ఫ్రాంఛైజీ తరుపున క్రికెట్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఒక విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ హాంకాంగ్ కోవ్లాన్ కంటన్స్ ఫ్రాంఛైజీ తరుపున క్రికెట్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఒక విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్న పఠాన్ తన ఫామ్‌ను మరింతగా మెరుగు పరచుకునేందుకే హాంకాంగ్ టీ20 లీగ్‌లో కోవ్లాన్ కంటన్స్ ఫ్రాంఛైజీ తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పాడు.

Yusuf Pathan to feature in Hong Kong T20 league, becomes first Indian to sign for foreign league

చైనాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకుగాను ఆడుతున్న ఈ లీగ్ మార్చి 8వ తేదీ నుంచి 12వరకు జరగనుంది. దీంతో ఈ లీగ్‌లో తాను పాల్గొనబోతున్నట్లు క్రిక్‌ఇన్ఫో వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పఠాన్ వెల్లడించాడు.

'హాంకాంగ్ ట్వంటీ20లో పాల్గొనేందుకు సంతకం చేశా. ఆ లీగ్‌లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దాంతో ఆ లీగ్‌తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్‌తో ఒప్పందం చేసుకోవడానికి ఐపీఎలే ప్రధాన కారణం. ఐపీఎల్‌కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నా' అని పఠాన్ తెలిపాడు. కాగా, ఈ లీగ్‌లో ఆడటం తన దేశవాళీ కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపదని పఠాన్ పేర్కొన్నాడు.

టీమిండియాకు చివరిసారిగా 2012లో యూసప్ పఠాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పఠాన్ కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు. కాగా, కోవ్లాన్ కంటన్స్ తరుపున ఆడుతున్న మూడో విదేశీ ఆటగాడిగా పఠాన్ గుర్తింపు పొందాడు.

పఠాన్‌కి ముందు పాకిస్థాన్‌కు ఆటగాడు షాహిద్ అఫ్రిదీ, ఇంగ్లాండ్‌కు చెందిన తైమల్ మిల్స్ ఇదే ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లీగ్‌లో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్‌లతో పాటు వెస్టిండిస్ డారెన్ సమీ, న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ ఫ్రాంక్లిన్, దక్షిణాఫ్రికా జాహాన్ బోతాలు వివిధ ప్రాంఛైజీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ లీగ్‌లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. మొదటి నాలుగు రోజులు కూడా నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మార్చి 12వ తేదీన పైనల్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X