న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆత్మ విశ్వాసం నింపాడు: క్యాన్సర్ చిన్నారులతో యువరాజ్

టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ శుక్రవారం క్యాన్సర్ బాధిత చిన్నారులను కలిశారు. కటక్‌లోని టీమిండియా బస చేసిన హోటల్ వద్దకు వచ్చిన క్యాన్సర్ బాధిత చిన్నారులతో యువరాజ్ కొంత సమయాన్ని గడిపాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ శుక్రవారం క్యాన్సర్ బాధిత చిన్నారులను కలిశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్ మ్యాచ్ తర్వాత కటక్‌లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాడు.

అక్కడున్న క్యాన్సర్ బాధిత చిన్నారులతో యువరాజ్ కొంత సమయాన్ని గడిపాడు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా గడిపిన యువీ వారితో ఫోటోలు దిగాడు. తమ అభిమాన క్రికెటర్‌ని కలవడం పట్ల చిన్నారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2011 వరల్డ్ కప్ అనంతరం యువీ క్యాన్సర్ బారిన పడ్డాడు.

Yuvraj Singh meets cancer patients after whirlwind knock against England

అయితే కీమోథెరపీ సాయంతో ఆ మహమ్మారిని జయించిన సంగతి తెలిసిందే. ఆ పోరాటం తర్వాతే యువరాజ్ యూవీకెన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నాడు. అందులో భాగంగానే మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్ ఆ ఆసుపత్రికి వెళ్లాడు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం కటక్‌లో రెండో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సిరిస్‌లో ఇంకో మ్యాచ్ మిగులుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది. కటక్ వన్డేలో యువరాజ్‌ సింగ్ చెలరేగాడు.

సుమారు ఆరేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఇది యువీకి 14వ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే ఆదివారం (జనవరి 22)న కోల్‌కతాలో జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X