లండన్: భారత క్రికెటర్లు సమయం దొరికితే చాలు కుటుంబ సభ్యులతో విదేశాల్లో ఎంచక్కా విహరిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పేరు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సచిన్ ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లోనే గడుపుతున్నాడు.
ఎప్పటికప్పుడు తాను ఎక్కడున్నాడనే విషయాన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈ కోవలోకి మరో ఆటగాడు చేరిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-9లో సర్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్ తన ప్రేయసితో లండన్ వీధుల్లో విహరిస్తున్నాడు.
తాజాగా యువీ తన ప్రేయసితో కలిసి లండన్‌లోని హైడ్ పార్కులో దిగిన ఫొటోను తన ఇనిస్టా గ్రాంలో షేర్ చేశాడు. త్వరలోనే హెజెల్ కీచ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు గతేడాది సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.
ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు అంగీకరించారు. హెజెల్ కీచ్ బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. బిల్లా, బాడీగార్డ్ అనే సినిమాలో నటించింది. జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో పలువురు క్రికెటర్లు ఇలా విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్నారు.