న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

150 ఔట్: తనపై నమ్మకం ఉంచిన కోహ్లీకి యువీ థాంక్స్

తనపై నమ్మకం ఉంచినందుకు టీమిండియా కెప్టెన్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు యువరాజ్ థ్యాంక్స్ చెప్పాడు. కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ తన కెరీర్‌లోనే అత్యత్తుమ ఇన్నింగ్స్ ఆడాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: తనపై నమ్మకం ఉంచినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ థ్యాంక్స్ చెప్పాడు. కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యత్తుమ ఇన్నింగ్స్ ఆడాడు.

సింహాలకు టైమ్ వచ్చింది: ధోని-యువీలపై ఎవరేమన్నారు

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన యువరాజ్ కెప్టెన్‌గా కోహ్లీ తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా తనలో ఆత్మవిశ్వాన్ని నింపాడని అన్నాడు. డ్రస్సింగ్ రూంలోని ఆటగాళ్లు తనపై ఉంచిన నమ్మకం తనకు ఎంతో ముఖ్యమని చెప్పాడు.

రంజీ సీజన్‌లో తన బ్యాటింగ్ ప్రదర్శనపై యువరాజ్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. రెండో వన్డేలో ధోనికి, తనకి మధ్య చక్కటి అవగాహన కుదిరిందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఆడామని, తొలుత 50 పరుగుల భాగస్వామ్యం చేయాలని అనుకున్నామని చెప్పాడు.

Yuvraj Singh thanks new captain Virat Kohli after 150-run knock

ఇది సాధించాక 100 పరుగుల భాగస్వామ్యంపై దృష్టిసారించామని అన్నాడు. ఆ తర్వాతే అదే జోరు కొనసాగిస్తూ సెంచరీలు చేశామని తెలిపాడు. గతంలో మేం ఎన్నో మ్యాచ్ లను గెలిపించామని చెప్పాడు. తాను బౌండరీలు సాధించడాన్ని గమనించిన ధోనీ స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడని ఇదే టీమిండియా భారీ స్కోరు చేయడానికి ఉపయోగపడిందన్నాడు.

ముఖ్యంగా కటక్ వన్డేలో ధోనినన్ను ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసం కలిగించాడని యువీ పేర్కొన్నాడు. కటక్ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. జనవరి 22 (ఆదివారం) జరగనున్న మూడో వన్డేలో విజయం సాధించి సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనలో టీమిండియా ఉంది.

చివర్లో కోహ్లీ ఒత్తిడి: అన్నీ తానై ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని

25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ధోని సైతం 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. 2011లో చివ‌రిసారిగా వరల్డ్ కప్‌లో సెంచ‌రీ సాధించిన యువరాజ్ మ‌ళ్లీ ఆరేళ్ల త‌ర్వాత సెంచరీని సాధించడం విశేషం. ఇక ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X