న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగ్లా పర్యటన: ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గాల్సిందే, ఫెయిలైతే ఇంటికే..!

By Nageswara Rao

కోల్‌కత్తా: వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటన వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గాల్సి ఉంది. గతంలో ఆస్టేలియా పర్యటనలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ని జూన్ 10న ఆడనుంది.

గతంలో ఎవరైతే గాయాలుపాలయ్యారో వారు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యే వారు. ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. జూన్ 6న బీసీసీఐ ఈ ఫిట్‌నెస్ పరీక్షను కోల్‌కత్తాలో నిర్వహించనుంది. ఈ ఫిట్‌నెస్ పరీక్షలో ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.

Entire Indian squad to undergo fitness test ahead of Bangladesh series

దీనిపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలా మంది ఆటగాళ్లు పర్యటన మధ్యలో ఫిట్‌నెస్‌ లేమితో ఇంటి ముఖం పట్టారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ ఫిట్‌నెస్‌లో ఫెయిలైన ఆటగాళ్లను బంగ్లా పర్యటనకు అనుమతించమని చెప్పారు.

గతేడాది ఆసీస్ పర్యటనలో భుజం గాయంతో రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌లు టెస్టు సిరిస్ మధ్యలోనే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆస్టేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో గాయపడిన ఇషాంత్‌ శర్మ వరల్డ్ కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X