న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్‌బెర్త్‌పై పుణె ఆశలు: కోల్‌కతా రణన్నినాదం

By Pratap

పుణె: గత ఏడాది రెండు నిమిషాల్లోనే రెండుసార్లు ట్రోఫీకి చేరువయ్యే అవకాశాన్ని కోల్పోయిన ఎఫ్‌సి గోవా జట్టు ఈ దఫా ఆ చేదు అనుభవానికి తిలోదకాలిచ్చి.. అగ్రస్థానంలో దూసుకెళ్లాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. 2014లో ప్రారంభ ఎడిషన్‌లో అద్భుతంగా ఆడినా గత ఏడాది సెమీ ఫైనల్స్‌కు దూసుకొచ్చినా.. ఫైనల్స్‌కు లిప్తపాటులో దూరమైంది.

గత ఏడాది లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 29 స్ట్రోక్స్‌ అత్యంత నైపుణ్యం గల క్రీడాకారుల జట్టుగా దూసుకొచ్చిందీ జట్టు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ, విశ్లేషించుకుంటూ సంబురంగా ముందుకు సాగింది. మ్యాచ్‌ వీక్షణకు వచ్చిన సందర్శకులు, ఫుట్‌బాల్‌ ప్రేమికులకు వినోదాన్నందించేందుకు పోటీ పడే విధంగా జట్టు సభ్యులను బ్రెజిల్‌కు చెందిన జట్టు కోచ్‌ జికో ప్రోత్సహించాడు.

తాజాగా ఇండియన్‌ స్ట్రైకర్‌ రాబిన్‌సింగ్‌ రాకతో ఈ ఏడాది మూడో ఎడిషన్‌లోనూ ఎఫ్‌సి గోవాజట్టు తప్పనిసరిగా ముందు వరుసలో నిలుస్తుందనడంలో సందేహం లేదు. గోవా జట్టుకు మార్క్యూ మాన్‌ (సారథి) లుసియో సమక్షంలో గ్రేగోరీ అమోలిన్‌ వెనుక భాగంలోనూ, గోల్‌పోస్ట్‌లో లక్ష్మీకాంత్‌ కట్టిమణిల సహకారంతో గత ఏడాది టాప్‌ స్కోరర్‌ రియోనాల్డో మరోసారి ముందు వరుసలో నిలవనున్నాడు.

FC Goa determined to turn agony into ecstasy

అత్యధికులు గోవా వాసులే కావడంతోపాటు మెరుగైన ఆట కోసం కోచ్‌గా జికో జట్టును నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దిన ఘనత దక్కుతుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రారంభంలో లా లీగా లీగ్‌లో విల్లార్రెల్‌ జట్టు తరఫున ఆడేందుకు వెళ్లిన మందార్‌రావ్‌ దేశాయి ఆట తీరు మరింత పదునెక్కిందనడంలో సందేహం లేదు.

ప్రముఖ డిఫెండర్‌ దేబబ్రతదాస్‌తోపాటు కొత్త ఆటగాళ్లు డెంజిల్‌ ఫ్రాంకో, ఫుల్గానికో కార్డోజో అదనపు బలం కానున్నారు. ఎనిమిది మంది బ్రెజిలియన్లు, ఆరుగురు గోవా కుర్రాళ్లతో జట్టును పటిష్ఠంగా తీర్చి దిద్డాడు కోచ్‌ జికో.

'స్ట్రాంగ్‌ విజన్‌ కొనసాగింపే ముఖ్యం. కానీ మేం ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు. ఫుట్‌బాల్‌లో ఫలితాలే ముఖ్యం. గత రెండేళ్లు మంచి ఫలితాలు సాధించాం. మూడో సీజన్‌లోనూ మంచి ఫలితాలు సాదిస్తాం' అని కోచ్‌ జికో వ్యాఖ్యానించారు.

చాంప్‌గా నిలవడంపైనే కోల్‌కతా ఫోకస్‌!

ఐఎస్‌ఎల్‌ ప్రారంభ చాంపియన్‌గా నిలిచిన అట్లెంటికో డీ కోల్‌కతా.. మూడో ఎడిషన్‌లో తిరిగి చాంపియన్‌గా విజయం సాధించేందుకు యుద్ధ తంత్ర వ్యూహాలు రూపొందించుకున్నది. మీడ్‌ ఫీల్డ్‌తోపాటు అనునిత్యం ఎదురుదాడి చేయడంతో మూడేళ్లలో రెండో టైటిల్‌ కైవసం చేసుకొనేందుకు కసరత్తు చేస్తున్నది.

గత ఏడాది మోకాలి నరానికి గాయంతో తొలి మ్యాచ్‌ తర్వాత టోర్నీకి దూరమైన సారధి (మార్క్యూ ప్లేయర్‌) హెల్డర్‌ పోస్టిగ, కెనడా హిట్టర్‌ ఇయాన్‌ హుమ్‌, సౌతాఫ్రికా వింగర్‌ సమీహ్గ్‌ దౌటీలు కోల్‌కతాకు కీలకం. గత ఏడాది అట్లెంటికో డికో కోల్‌కతా ఆటగాడిగా ఇయాన్‌ హుమ్‌ 11 గోల్స్‌తో అగ్రస్థానంలో జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేశాడు. కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఐదుసార్లు టార్గెట్‌ను హిట్‌చేశాడు ఇయాన్‌.

ఇక డౌటీ ప్రత్యర్థులపై దాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. మాజీ క్రికెటర్‌ సౌరబ్‌ గంగూలీ సహ యజమానిగా గల జట్టులో గత ఏడాది పోస్టిగతోపాటు జావిలారా, అరాటా ఇజుమి తదితర కీలక ఆటగాళ్లు గాయాల బారీన పడటం కూడా కోల్‌కతా వెనుకబడటానికి కారణం. గత ఏడాది ఒక్క మ్యాచ్‌ మినహా అన్నింటిలో మెరుగైన ఆట తీరే ప్రదర్శించామని ఇయాన్‌ హుమ్‌ తెలిపారు. తమకు గొప్ప జట్టు చేతిలో ఉన్నదని, ఈ దఫా తిరిగి ట్రోఫీని గెలుచుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

డౌటీ, హుమ్‌తోపాటు గత ఏడాది గాయాలతో వెనక్కు వెళ్లిన జైమీ గావిలన్‌ తిరిగి జట్టులో కొనసాగుతున్నారు. గావిలన్‌ సృజనాత్మక ఆటకు మారుపేరుగా నిలిచాడు. ఆయన ఆటతీరుపైనే అట్లెంటికో డీ కోల్‌కతా ఆటతీరు ఆధారపడి ఉంది.

ఇంతకుముందు జట్టులో ఉన్న హబాస్‌.. పుణె సిటీ జట్టుకు వెళ్లడంతో జోస్‌ ఫ్రాన్సిస్కో మోలినా నేతృత్వంలో ఈ దఫా కోల్‌కతా ఐఎస్‌ఎల్‌ టోర్నీకి సిద్ధమైంది. క్రితంసారి స్కిప్పర్‌ బోర్జా, జైమీ గావిలన్‌ ద్వయం పూర్తిస్థాయిలో 1092 పాస్‌లు పొందడమే జట్టు క్యాంపెయిన్‌లో వారిని అగ్రభాగాన నిలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X