న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

లా లీగ 12వ వారం: తిరుగులేని రియల్ మాడ్రిడ్

కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తనదైన పోర్చుగీస్ శైలిలో మళ్లీ చెలరేగిపోయాడు.

By Nageshwara Rao

బెంగళూరు: స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ' టోర్నీ 12వ వారానికి చేరుకున్నది. ఈ వారంలో మాడ్రిడ్ జెయింట్స్ - రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య జరిగిన మ్యాచ్ పతాక శీర్షికలకెక్కింది. మాడ్రిడ్‌లోని విసెంటే కాల్డ్రోన్ గ్రౌండ్స్‌లో డియాగో సిమోన్స్, జినెడైన్ జిడానే కుర్రాళ్లు పోటీ పడ్డారు.

కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తనదైన పోర్చుగీస్ శైలిలో మళ్లీ చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో అట్లెటికో మాడ్రిడ్‌పై 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించాడు. విసెంటే కాల్డ్రోన్ స్టేడియంలో మాడ్రిడ్ జట్లు పోటీ పడటం ఇదే చివరిసారి.

ఈ రెండు జట్లు వచ్చే సీజన్‌లో మరో స్టేడియం నుంచి తలపడనున్నాయి. ఇక అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్లు తమ దాయాది జట్టు ప్రతిభ, ప్రదర్శన ముందు తేలిపోయారు. జిడానే తనదైన శైలిలో రచించిన ప్రణాళిక అద్భుతంగా పనిచేసింది. గారెథ్ బాలె, క్రిస్టియానో రొనాల్డోలను అటాకింగ్‌కు దించి అద్భుతాల సాధనకు తెర తీశాడు.

 Bengaluru: La Liga game week 12 is underway and 9 out of 10 scheduled matches were played on Saturday, November 19

సొంతగడ్డపై దాయాది జట్టుతో తలపడి విజయం సాధించిన రియల్ మాడ్రిడ్‌కు లీగ్ టోర్నీలో ఎదురు లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో 30 పాయింట్లు సాధించిన రియల్ మాడ్రిడ్.. తన చిరకాల ప్రత్యర్థి బార్సిలోనా ఎఫ్ సి కంటే నాలుగు పాయింట్ల ఆధిక్యంతో టాప్ పొజిషన్‌లో నిలిచింది.

బార్సిలోనా మరోసారి తన అభిమానులను డిజప్పాయింట్ చేసింది. మాలాగాపై జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించలేక చతికల పడింది. లూయిస్ సౌరెజ్ పై సస్పెన్షన్, లియానెల్ మెస్సీ అనారోగ్యం మధ్య బరిలోకి దిగిన బార్సిలోనా జట్టులో లూయిస్ ఎన్రిక్యూ బరిలోకి దిగినా గోల్స్ లేని డ్రాగా ముగించింది. ఫలితంగా తమ ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే బార్సిలోనా నాలుగు పాయింట్లు వెనుకబడింది.

ఆదివారం వరకు గెలుపొందిన మ్యాచ్‌ల వివరాలు:

రియల్ బెటిస్ 2 - 0 లాస్ పాల్మాస్
డెపోర్టివో 2 - 3 సెవిల్లా
ఎఫ్ సి బార్సిలోనా 0 - 0 మాలాగా
ఎయిబర్ 1 - 0 సెల్టా విగో
అట్లెటికో మాడ్రిడ్ 0 - 3 రియల్ మాడ్రిడ్
అలావెస్ 0 - 1 ఇస్పాన్యోల్
వాలెంసియా 1 - 1 గ్రనాడ
స్పోర్టింగ్ 1 - 3 రియల్ సోషిడాడ్
అథ్లెటిక్ బిల్బావో 1 - 0 విల్లార్రెల్

మంగళవారం జరిగే మ్యాచ్:
లిగానెస్ వర్సెస్ ఒస్సాసునా

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X