న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫుట్‌బాల్ కోసం ఫ్యాన్స్‌ను ప్రోత్సహించాలి: ఫోర్లాన్

By Nageshwara Rao

ముంబై: భారత్ లో ఫుట్ బాల్ ను ప్రోత్సహించాలంటే ముందుగా ఆ ఆటపట్ల అభిమానం గల వారిని ప్రోత్సహించడమే గొప్ప పని అని ముంబై సిటీ ఎఫ్ సి సారధి డియాగో ఫోర్లాన్ వ్యాఖ్యానించాడు. తన టీం సహచర ఆటగాడు డెఫెడెరికో కూడా ఐఎస్ఎల్ ద్వారా అభివ్రుద్ధి చెందుతున్న ఫుట్ బాల్ భారతీయులందరినీ ఆకర్షిస్తుందని నమ్ముతున్నాడని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముంబై జట్టు సారధిగా ఫోర్లాన్.. పేరొందిన ప్లేయర్ మాత్రమే కాదు పిచ్‌పై చురుగ్గా వ్యవహరిస్తాడని ప్రతీతి. అసాధారణ ప్రతిభ గలిగిన తనను రణబీర్ కపూర్ సహ యజమానిగా గల ముంబై సిటీ ఫ్రాంచైసీ ఎంపిక చేసుకోవడం వారి విజన్ ను తెలియజేస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

భరత ఉపఖండంలో ఫుట్ బాల్ పురోభివ్రుద్ధి చెందాలంటే గాయపడిన క్రీడాకారులకు ఆర్థికపరమైన చేయూతనివ్వడంతోపాటు వారికి శిక్షణనివ్వాలని సూచించాడు. విశాలమైన షెడ్యూల్ తో లీగ్ నిర్వహించడం ద్వారా మాత్రమే ఐఎస్ఎల్ టోర్నీలో పుట్ బాల్ లో క్వాలిటీ పెంపొందుతుందన్నాడు. ముంబై సిటీ ఎఫ్ సి జట్టు శక్తివంతమైనదైనా, సమర్థవంతమైనదైనా ఐఎస్ఎల్‌లో ప్రతి మ్యాచ్ క్లిష్టమైందేనన్నాడు.

Diego Forlan: ISL is a great first step to encourage fans to take football up

'ఆటగాళ్లకు ఇచ్చే ఆఫర్ చాలా మంచిది. మరింత ముఖ్యమైంది కూడా. ఈ ప్రాజెక్టును వారు సొమ్ముచేసుకుంటారు. ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తనతో ముంబై సిటీ ఫ్రాంచైసీ యాజమాన్యం చేసిన ప్రతిపాదనతో నేను ఏకీభవించా' అని తెలిపాడు. అందుల్లే అట్లెటికో డీ కోల్ కతా తరఫున ఆడాలని ఉన్నా ముంబైతో చేరానన్నాడు.

భారతదేశంలో ఫుట్ బాల్ ఆట కొన్ని శక్తుల నియంత్రణలోనే ఉన్నదని దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నాడు. భారత్ లో ఇతర క్రీడలన్నీ ప్రజాదరణ పొందినవేనని, కానీ ఫుట్ బాల్ పరిస్థితి అందుకు భిన్నమని, అదే సమయంలో పరిస్థితిలో మార్పు తేవడం కూడా అంత తేలికేం కాదని స్పష్టంచేశాడు.

లక్కీగా ఐఎస్ఎల్ వల్ల భారత్ లో ఫుట్ బాల్ పట్ల సాదారణ ప్రజానీకంలో క్రమంగా ఆసక్తి పెరుగుతున్నదన్నారు. ఇటీవలే భారత్ జాతీయ జట్టు దేశీయంగా, ఖండాంతరాల్లోనూ, అంతర్జాతీయంగా తన మెరుగైన ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శిస్తున్నదని, కానీ ఫ్యాన్స్ ఆకాంక్షలకు అనుగుణంగా మరింత మెరుగు పడాల్సి ఉన్నదని తెలిపాడు.

'ముంబైకి మంచి స్క్వాడ్ ఉంది. అద్భుతమైన సెటప్ కలిగి ఉన్నాం. కానీ నేను లీగ్ లోని ఇతర టీంలను అనుసరిస్తున్నదాని ప్రకారం ప్రతి ప్రత్యర్థి, ప్రతి మ్యాచ్ కూడా క్లిష్టంగానే ఉంటుంది. ఒకానొక సమయంలో మాకు పూర్తి స్క్వాడ్ లేనప్పుడు వారంతా తమతో చేరతారని ఆశలు పెట్టుకున్నాం' అని తెలిపాడు.

దేశవ్యాప్గంగా మంచి స్టేడియంలు, మంచి పిచ్ లు ఉన్నాయని, ప్రసారాలు బాగానే వస్తున్నాయని, అదే సమయంలో లీగ్ కూడా గొప్పగా సాగుతున్నదని, మ్యాచ్ లను వీక్షించేందుకు భారీగా తరలి వస్తున్న అభిమానులు మధ్యలోనే తరలిపోవడం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడుతుందన్నారు. అంతర్జాతీయ లీగ్ ల మాదిరిగా భారత్ లో ఫుట్ బాల్ లీగ్ గడువు మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X