న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇపిఎల్‌లో 12వ వారం: టాప్‌లోకి చెల్సియా

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫుట్ బాల్ టోర్నీ 12వ వారానికి చేరుకున్నది. ఇపిఎల్ పాయింట్ల పట్టికలో మాత్రం చెల్సియా టాప్ స్థానంలో చేరిపోయింది.

By Nageshwara Rao

బెంగళూరు: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫుట్ బాల్ టోర్నీ 12వ వారానికి చేరుకున్నది. ఈ వారంలో ప్రత్యర్థులు మాంఛెస్టర్ యునైటెడ్, అరెన్సల్ మధ్య ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్‌లో పతాకశీర్షికలకెక్కింది. జోస్ మౌరిన్హో, ఆర్సెన్ వింగర్ మధ్య సంకుల సమరమే దీనికి కారణం. ఇక ఇపిఎల్ పాయింట్ల పట్టికలో మాత్రం చెల్సియా టాప్ స్థానంలో చేరిపోయింది.

చెల్సియా తన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఈ దఫా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ వచ్చింది. మిడిల్స్ బ్రౌగ్‌పై జరిగిన మ్యాచ్‌లో డియాగో కోస్టా చేసిన సింగిల్ గోల్ తో చెల్సియా ఈ రికార్డు నెలకొల్పింది. జువాన్ మాటా 65వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

ఇక మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు మరింత ఆధిపత్యం కోసం మూడు పాయింట్లు సాధించేందుకు జట్టులో మార్పు చేశాడు. గన్నర్స్ పేలవమైన ప్రదర్శనతో ఒక్క సింగిల్ సానుకూల చాన్స్ కూడా కల్పించలేకపోయారు. 88వ నిమిషంలో మాత్రమే గన్నర్స్‌కు సరైన చాన్స్ లభించింది. సబ్ స్ట్యూట్ స్ట్రయికర్ ఒలివియర్ గిరౌండ్ పంపిన బంతిని కుడివైపున ఒడిసిపట్టిన అలెక్స్ ఆక్స్ లాడ్ చాంబిర్లాయన్ క్రాస్ గా గోల్‌పోస్ట్ దారి మళ్లించాడు.

English Premier League game week 12: Roundup and results

తద్వారా మాంఛెస్టర్ యునైటెడ్ నుంచి గోల్ సాధించేందుకు ప్రయత్నించాడు. ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లలో మాంఛెస్టర్ సిటీ కుర్రాడు యాయా టౌర్ శక్తిమంతంగా దూసుకొచ్చాడు. తద్వారా మాంఛెస్టర్ సిటీకి పాయింట్ సాధించాడు. తద్వారా సిటిజన్స్ జట్టు లీగ్ టేబుల్‌పై టాప్‌లో నిలిచారు.

టౌరెను నిర్లక్ష్యం చేసిన పెప్ గౌర్డియోల.. క్రిస్టల్ ప్యాలెస్ మెయిన్ జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు సౌథాంప్టన్, లివర్ పూల్ మధ్య జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది.

ఆదివారం వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలివి:
మాంఛెస్టర్ యునైటెడ్ 1 - 1 ఆర్సెనల్
సుందర్ లాండ్ 3 - 0 హుల్ల్ సిటీ
వాట్ఫోర్డ్ 2 - 1 లైసెస్టర్ సిటీ
క్రిస్టల్ ప్యాలెస్ 1 - 2 మాంఛెస్టర్ సిటీ
ఎవర్టోన్ 1 - 1 స్వాన్‌సీ సిటీ
స్టోక్ సిటీ 0 - 1 ఎఎఫ్ సి బౌర్నెమౌత్
సౌతాంప్టన్ 0 - 0 లివర్‌పూల్
టొట్టెన్హం హాట్స్ పూర్ 3 - 2 వెస్ట్ హమ్ యునైటెడ్
మిడిల్స్ బ్రౌగ్ 0 - 1 చెల్సియా

సోమవారం జరిగే మ్యాచ్ :
వెస్ట్ బ్రోంవిచ్ అల్బియాన్ వర్సెస్ బర్న్ లీ

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X