న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ప్లాష్‌బ్యాక్ 2016: ముంబై ఆధిపత్యం, లక్షల మంది మదిలో కేరళ

పెనాల్టీ షూటౌట్ల ద్వారా కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై విజయం సాధించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని అట్లెటికో డి కోల్‌కతా ఐఎస్ఎల్ టైటిల్ ఎగురేసుకు పోయింది.

By Nageshwara Rao

బెంగళూరు: పెనాల్టీ షూటౌట్ల ద్వారా కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై విజయం సాధించి ఐఎస్ఎల్ టైటిల్ ఎగురేసుకు పోయింది సౌరవ్ గంగూలీ సేన. మూడేళ్లలోనే రెండోసారి ఐఎస్ఎల్ చాంపియన్స్ షిప్ కిరీటాన్ని ధరించి అట్లెటికో డి కోల్‌కతా జట్టు భారత ఫుట్ బాల్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పింది.

సచిన్ సహ యజమానిగా గల జట్టు కూడా టైటిల్ పోరులో ఓటమి పాలవ్వడమూ రెండోసారే కావడం గమనార్హం. ఈ నెల 18న టైటిల్ పోరుతో ముగిసిన ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ముఖ్యాంశాలు ఒక్కసారి పరిశీలిద్దాం...

చాంపియన్‌గా కోల్‌కతా

చాంపియన్‌గా కోల్‌కతా

క్రికెట్ టీమిండియాలో బెంగాలీ దాదాగా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ సారథ్యంలోని కోల్ కతా.. తన సహచర మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై పెనాల్టీల్లో 4-3 స్కోర్ తేడాతో విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది. దీనికి ముందు గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రెండున్నర నెలలకు పైగా సాగిన భారత సాకర్ సంరంభంలోనే ప్రతి అంశంలో ఐఎస్ఎల్ 3 పెద్దదీ మెరుగైన టోర్నీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

తొలిసారి టాప్ 4లోకి ముంబై సిటీ

తొలిసారి టాప్ 4లోకి ముంబై సిటీ

ఐఎస్ఎల్ టోర్నీ మొదలైన మూడేళ్లలో తొలిసారి టాప్ 4 జాబితాలో అడుగు పెట్టింది ముంబై సిటీ ఎఫ్ సి. రణబీర్ కపూర్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న ముంబై సిటీ జట్టు ఈ సీజన్ టోర్నీ లీగ్ దశలో అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి టాప్ స్థానానికి దూసుకెళ్లింది. అనుభవం గల మేనేజర్ అలెగ్జాండ్రీ గుమారెస్, సారథి డియాగో ఫోర్లాన్ వంటి వారి ఉమ్మడి మార్గదర్శకత్వంలో ముందుకు సాగిన ముంబై సిటీ జట్టు ముందు లీగ్ దశలో ప్రతి జట్టు తల వంచాయి. దురద్రుష్టవశాత్తు సెమీ ఫైనల్స్ దశలో అట్లెటికో డి కోల్ కతా జట్టు చేతిలో ఓటమి పాలయ్యింది. సారధి డియాగో ఫోర్లాన్ నిరంతరం జట్టుకు విజయాలు సాదించి పెట్టి టాప్ 4లో నిలిపాడు.

క్లాస్ షో ప్రదర్శించిన ఢిల్లీ డైనమోస్

క్లాస్ షో ప్రదర్శించిన ఢిల్లీ డైనమోస్

ఈ ఏడాది టోర్నీలో ఢిల్లీ డైనమోస్ జట్టు తనదైన శైలిలో క్లాస్ షో ప్రదర్శించి బెస్ట్ టీంగా నిలిచింది. సారథిగా ఫ్లోరెంట్ మాలౌదా తన అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడంతో ఈ ఏడాది హీరో ఆఫ్ ది లీగ్ అవార్డు గెలుచుకున్నారు. మరో డైనమోస్ స్టార్.. బ్రెజిలియన్ స్టార్ ప్లేయర్ మార్సిలిన్హోపైనే ఈ సీజన్ లో అందరి కళ్లూ పడ్డాయి. తదనుగుణంగా టోర్నీలోనే అత్యధికంగా 10 గోల్స్ సాధించిన మార్సిలిన్హో ఐఎస్ఎల్ 3 ఎడిషన్ కే హైలేట్ గా నిలిచాడంటే అతిశేయోక్తి కాదు. తద్వారా మార్సిలిన్హో ఈ ఏడాది గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్నాడు. గత ఏడాది చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి, రన్నరప్ ఎఫ్ సి గోవా కుర్రాళ్లు ఈ ఏడాది చాలా దారుణంగా ప్రతిభ ప్రదర్శించడంలో విఫలమై 7వ, 8వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.

లక్షల మంది మదిలో కేరళ

లక్షల మంది మదిలో కేరళ

ఈ ఏడాది టోర్నీ ఆసాంతం కేరళ బ్లాక్ బస్టర్స్ అభిమానులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి అందరి మన్ననలు ప్రత్యేకించి ఐఎస్ఎల్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రశంసలు అందుకున్నారు. టోర్నమెంట్‌కే హైలేట్‌గా నిలిచారని ఆమె అభివర్ణించారు. ‘ఎల్లో ఆర్మీ'గా స్టేడియం అంతటా ఆవరించిన అభిమాన జన సందోహం.. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు వెన్నెముకగా నిలిచారంటే అతిశేయోక్తి కాదు. కేరళ బ్లాక్ బస్టర్స్ పై విజయం సాధించి అట్లెటికో డి కోల్‌కతా.. ఈ ఏడాది ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవచ్చు కానీ కేరళ కుర్రాళ్లు మాత్రం లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రారంభం నుంచి జట్టుకు జోష్ కల్పించి తమ ఫేవరెట్ క్లబ్ నకు అండదండలు కల్పించారు ఫ్యాన్స్. తద్వారా రియల్ హీరోలుగా నిలిచారు. టోర్నీలో పేలవంగా ప్రయాణం ప్రారంభించిన యెల్లో టీం క్రమంగా అభిమానుల దన్నుతో పుంజుకుని ఫైనల్స్ వద్ద చతికిల పడింది.

నార్త్ఈస్ట్ మరో ‘సారీ’

నార్త్ఈస్ట్ మరో ‘సారీ’

స్ఫూర్తిదాయక ప్రతిభ కనబరిచిన నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు తర్వాతీ దశలో మరోసారి విఫలమైంది. టాప్ 4 జాబితాలో చోటు దక్కించుకోవడంలో జాన్ అబ్రహం సారథ్యంలోని జట్టు వెనుకబడింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి జట్టు చేతిలో ఓటమి పాలవ్వడంతో సెమీస్ మెట్లెక్కకుండానే వెనుదిరిగింది నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు.

ఎఫ్ సి ఫుణెలో పూర్తిగా న్యూ లుక్

ఎఫ్ సి ఫుణెలో పూర్తిగా న్యూ లుక్

ఎఫ్ సి పుణె జట్టు పూర్తిగా న్యూ లుక్ తో ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీలో పాల్గొన్నది. నూతన ఆటగాళ్లు, నూతన మేనేజర్లతో రంగ ప్రవేశం చేసింది. అట్లెటికో డి కోల్ కతా మాజీ కోచ్ అంటోనియో లోపేజ్ హబాస్.. పుణె జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించినా పుణె సిటీని టాప్ 4 జాబితాలో నిలబెట్టడంలో వెనుకబడ్డారు.

చెన్నైయిన్ పూర్ పెర్పార్మెన్స్

చెన్నైయిన్ పూర్ పెర్పార్మెన్స్

డిఫెండింగ్ చాంపియన్లుగా చెన్నైయిన్ ఎఫ్ సి కుర్రాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానం (ఏడవ)లో నిలిచారు. మార్కో మాట్టరాజీ కుర్రాళ్లు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించారు.

గోవాను వెంటాడుతున్న దురదృష్టం

గోవాను వెంటాడుతున్న దురదృష్టం

గత రెండు సీజన్లలో టాప్ 4 దశకు చేరుకున్న ఎఫ్ సి గోవా జట్టు ఈ దఫా చివరి స్థానంలో చోటు దక్కించుకున్నది. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలోని నిరంతర ప్రతిభావంతమైన జట్టుగా పేరు దక్కించుకున్న జికో సేన.. ఆచరణలో పూర్తిగా వెనుకబడింది.

కేరళ బ్లాస్టర్స్ జట్టు అభిమానులు

కేరళ బ్లాస్టర్స్ జట్టు అభిమానులు

కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. బార్సిలోనా ఎఫ్‌సి స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పెనాల్టీ స్కిల్స్ మాదిరి కేరళ బ్లాస్టర్స్ అద్భుతంగా ఆడిందని కేరళ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X