న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అందుబాటులో లేని ఛెత్రి: విజయంపై ఆందోళన

By Nageshwara Rao

ముంబై: మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా తమ జట్టు సారధి డియాగో ఫోర్లాన్‌తో తాము సాధించాలనుకున్నదాన్ని పొందామని ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గౌమారెస్ వ్యాఖ్యానించాడు. ఇతర జట్లకు సారధిగా ఫోర్లాన్ ఒక ఐడియల్ అని కూడా గౌమారెస్ అన్నాడు.

'అవును. తొలి రెండు మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా పాయింట్లు పొందగలిగాం. పుణె, నార్త్ ఈస్ట్ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో ఆయన చేసిన గోల్స్ తమకు చేయూతనిచ్చాయి' అని చెప్పాడు. జట్టు సారధిగా డియాగో ఫోర్లాన్ తన విధులు తాను నిర్వర్తిస్తున్నాడు.

ఆటలో తనకు ఉన్న అనుభవాలను రంగరించి.. కుర్రాళ్లను గైడ్ చేస్తున్నాడన్నారు. ఎఎఫ్‌సి ఫైనల్స్‌కు అర్హత సాధించిన బెంగళూరు ఎఫ్ సి జట్టులోని సునీల్ ఛెత్రి సహా నలుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం.. మిగతావారిలో కొందరు గాయాల బారీన పడటం తమను వేధిస్తున్నదని గౌమారెస్ చెప్పాడు. గోల్స్ సాధనలో సమస్య ఉన్నా.. అవకాశాలను కల్పించడంలో తమ కుర్రాళ్లు విజయం సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు.

గాయాల పాలైన వారిలో ఎంతమంది తుది జట్టుకు అందుబాటులో ఉంటారో ప్రాక్టీస్ తర్వాత తెలుస్తుందన్నాడు. కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లోనే తాము సరిగ్గా స్పందించలేదన్నాడు. బెంగళూరు ఎఫ్ సిలో సునీల్ ఛెత్రి, గోల్ కీపర్ అమరీందర్ పాత్రేమిటో మనందరికీ తెలిసిందేనన్నాడు. ఎఎఫ్ సి ఫైనల్స్ తర్వాత సునీల్ ఛెత్రి తమ జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఆయన ఆకాంక్షించాడు.

Sunil Chetri

బాల్లోన్ డీ 'ఓర్ అవార్డుకు రొనాల్డో సహా ముగ్గురి నామినేషన్
పారిస్: స్పానిష్ లీగ్ 'లా లీగా'లో జెయింట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు స్టాల్ వర్ట్స్ క్రిస్టియానో రొనాల్డో, గారెథ్ బాలే, మాంఛెస్టర్ సిటీ ప్లేయర్ సెర్జియో అగౌరో 2016 బాల్లోన్ 'డీ ఓర్ ఫుట్ బాల్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ స్పోర్ట్స్ మ్యాగజైన్ 'ఫ్రాన్స్ ఫుట్‌బాల్' తెలిపింది.

బొరుస్సియా డోర్ట్ మండ్ స్ట్రయికర్ పెర్రీ ఎమెరిక్ ఔబామేయాంగ్, జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లాంగ్ టర్మ్ ఇటాలియన్ గోల్ కీపర్ జియాంలౌరీ బఫ్ఫన్ పేర్లనూ ఈ అవార్డుకు నామినేట్ చేసినట్లు ఈఫె పేర్కొంది. మరో 30 మంది పేర్లు కూడా త్వరలో వెలువడతాయని అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)తో సంబంధాలు దెబ్బ తిన్న తర్వాత బాల్లోన్'డీ ఓర్ ఈ ఏడాది అవార్డుల నామినేషన్‌కు నిబంధనలను సరళతరం చేసింది.

ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టీమ్స్ కోచ్ లు, సారధులతో కూడిన ప్రతినిధి బ్రుందాలకు బదులు అంతర్జాతీయ జర్నలిస్టులతో అవార్డుల నామినేషన్‌కు జ్యూరీని ఏర్పాటుచేసింది. 61వ వార్షికోత్సవ అవార్డుల ప్రదానోత్సవ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. 2013, 14లలో రొనాల్డో, 2009, 2010, 2011, 2012, 2015లలో బార్సిలోనా కీలకప్లేయర్ మెస్సీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది అవార్డుల్లో ఒకటి లా లీగా టాప్ ప్లేయర్లను అలరిస్తుందని అంతా భావిస్తున్నారు.

అంటోనియో కాంటే సంబరాలతో జోన్ మౌరిన్హో అన్ హ్యాపీ
లండన్: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో చెల్సియా కోచ్ ఆంటోనియో కాంటే వైఖరిపై మాంఛెస్టర్ యునెటెడ్ కోచ్ జోస్ మౌర్నిన్హో అసంత్రుప్తి వ్యక్తంచేశాడు. రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో చెల్సియా 4 పాయింట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత కాంటే వ్యవహారశైలి తనను కించపరిచే విధంగా ఉన్నదని మౌర్నిన్హో వ్యాఖ్యానించాడు.

చెల్సియా ఆటగాళ్లు పెడ్రో రోడ్రిగ్స్, గ్యారే చాహిల్, ఎడెన్ హజార్డ్, ఎన్'గోలో కాంటే.. తలా ఒక గోల్ చేయడంతో విజయం సాధ్యమైంది. గత సీజన్‌లో చెల్సియా సొంత గడ్డ స్టాంఫోర్డ్ బ్రిడ్జిలో ఆ జట్టు చేతిలో తొలిసారి ఓటమి పాలవ్వడం మౌర్నిన్హో షాక్‌కు గురయ్యారు. 1-0 తేడాతో ఓడిపోతే సంబరాలు చేసుకుంటే ఓకే.. కానీ 4-0 స్కోర్ తేడాతో ఓటమి పాలైన తమను కించ పరిచేందుకే సంబరాలు చేసుకున్నారని మౌర్నిన్హో అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X