న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ముంబై స్థిరత్వానికి నిదర్శనమన్న గుమారెస్


 ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవడం ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తుందని ముంబై సిటీ ఎఫ్‌సి హెడ్ కోచ్ అలెగ్జ్రాండీ గుమారెస్ వ్యాఖ్యానించాడు.

ముంబై: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవడం ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తుందని ముంబై సిటీ ఎఫ్‌సి హెడ్ కోచ్ అలెగ్జ్రాండీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. గత మ్యాచ్‌ను గోల్స్ లెస్ డ్రాగా ముగించడంతో 14 మ్యాచ్‌ల్లో 23 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ముంబైకర్లు.. ఆదివారం కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్‌సి, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాన్ని బట్టి సెమీ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థి ఎవరన్న అంశంపై ముంబైకర్లు ద్రుష్టిని కేంద్రీకరించారు.

ఈ నేపథ్యంలో గుమారెస్ మీడియాతో మాట్లాడుతూ 'ఈ రోజు మ్యాచ్ ఫలితంతో మాకు ఒక్క గోల్ అయినా సాధించొచ్చగలమన్న నమ్మకం కలిగింది. మేం లీగ్‌లో సెమీ ఫైనల్స్ బెర్త్ అర్హత సాధించేందుకు మాత్రమే ఆడటం లేదు. టాప్ స్థానంలో నిలవడమే లక్ష్యంగా ఆడుతున్నాం. ప్రస్తుత సీజన్‌లో మేం స్థిరంగా మాదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగుతున్నాం. మా కుర్రాళ్ల ఆటతీరు పట్ల నాకు గర్వంగా ఉంది. మా సిబ్బంది అద్భుతమైన క్రుషిచేశారు. మేం ఎనిమిది క్లీన్ చిట్లు సాధించడం అంత తేలికేం కాదు. చాలా బాగా ఆడకుండా మేం ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలిక కాదు' అని గుమారెస్ చెప్పాడు.

మూడోసారి తలపడిన రెండు జట్లలో ఢిల్లీపై ఆధిపత్యం సాధించే స్థాయికి ముంబై వెళ్లిందా? అని అనిపించింది. తమ కుర్రాళ్లు మంచి పెర్పార్మెన్స్ ప్రదర్శించారని, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ గోల్ కీపర్ డోబ్లాస్ అవార్డు కూడా పొందాడని చెప్పాడు. సొంత గడ్డపై తమ కుర్రాళ్లు మెరుగైన ఆటతీరు ప్రదర్శించారని పేర్కొన్నాడు.

తమ కుర్రాళ్లు ఎలా ఆడారన్నదే తనకు ముఖ్యమన్నాడు. గోవా జట్టుతో మ్యాచ్ తర్వాత తమ జట్టు ప్రత్యర్థులు స్కోర్ చేసే అవకాశం ఇవ్వలేదన్నాడు.

తమకు ప్లేయర్ల సేవలు అవసరమైనప్పుడు సునీల్ ఛెత్రి వంటి టాప్ ప్లేయర్ సేవలు వినియోగించుకుంటామన్నాడు. అమరీందర్ సింగ్ ఆటతీరును ప్రశంసల్లో ముంచెత్తిన గుమారెస్.. ఉదాంతా సింగ్‌పై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నాడు. అమరీందర్ సింగ్ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నాడు.

 Guimaraes hails players and staff after securing top spot

కంప్లయింట్లేమీ లేవన్న జంబ్రొట్టా

ముంబై సిటి జట్టుతో జరిగిన మ్యాచ్ గోల్స్ లేని డ్రాగా ముగిసినందుకు తన కుర్రాళ్లపై కంప్లయింట్లేమీ లేవని ఢిల్లీ డైనమోస్ హెడ్ కోచ్ గియాంలుకా జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. 14 మ్యాచ్‌ల్లో 21 పాయింట్లతో రెండో స్థానంలో ఢిల్లీ స్థిరపడి తదుపరి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ల వైపు ద్రుష్టి సారించింది. ఈ సందర్భంగా జంబ్రొట్టా మీడియాతో మాట్లాడుతూ తమ కుర్రాళ్ల ఆటతీరుతో తాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. ముంబైతో మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ అని, తమ పిల్లలు మంచి ప్రతిభ కనబరిచారన్నాడు.

ఈరోజు జరిగిన మ్యాచ్ చాలా కఠినమైందని, దురద్రుష్టవశాత్తు ఐదు రోజుల వ్యవధిలో రెండు మ్యాచ్ ల్లోనూ గోల్స్ లేకుండా మ్యాచ్ ముగించడం ఢిల్లీ డైనమోస్ జట్టుకు ఇబ్బందికరమన్నాడు.

తాము గోల్స్ సాధించేందుకు ముఖ్యమైన ప్లేయర్లు ప్రయత్నించారని, మరికొందరు అవకాశం కోసం ఎదురుచూశారన్నాడు. స్టార్ ప్లేయర్లు లేకుండానే మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారని చెప్పాడు. ఐఎస్ఎల్ అనుభవం చాలా మంచిగా ఉన్నదన్నాడు. ఐఎస్ఎల్ లక్ష్య సాధన సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడమేనన్నాడు. తమ కుర్రాళ్లలో కీయాన్ లూయిస్ అత్యంత స్ఫూర్తిదాయక భారతీయ ఆటగాడని జంబ్రొట్టా ప్రశంసించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X