న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

11వ వారానికి ఐలీగ్: మ్యాచ్ షెడ్యూల్, ఛానల్ సమాచారం

ఐ లీగ్ 11వ వారానికి చేరుకుంది. ఈ వారంలో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టు చెన్నై సిటీ ఎఫ్‌సితో ఐజ్వాల్‌లో తలపడనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐ లీగ్ 11వ వారానికి చేరుకుంది. ఈ వారంలో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టు చెన్నై సిటీ ఎఫ్‌సితో ఐజ్వాల్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టు అంతక ముందు ఈస్ట్ బెంగాల్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచి మంచి జోరు మీద ఉంది. 10 మ్యాచ్‌లాడిన ఐజ్వాల్ జట్టు 20 పాయింట్లతో ఈస్ట్ బంగాల్ తర్వాత రెండో స్ధానంలో ఉంది.

ఇక ఈ వారంలో బెంగుళూరు ఎఫ్‌సి, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. ఈ మధ్య కాలంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. బెంగుళూరు ఎఫ్‌సి జట్టు చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నా, గత 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోతుంది.

I-League 2017

పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక, ఈస్ట్ బెంగాల్ విషయానికి వస్తే గతంలో ఐజ్వాల్ ఎఫ్‌సితో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇక ఈ శనివారం మోహన్ బగాన్ జట్టు షిల్లాంగ్ లాజోంగ్ జట్టుతో తలపడనుంది.

11వ వారం జరిగే మ్యాచ్‌లు:

శనివారం, ఫిబ్రవరి 25
ఐజ్వాల్ ఎఫ్‌సి Vs చెన్నై సిటీ ఎఫ్‌సి - 2:05 PM (IST) (LIVE on i-league.org)
షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సి Vs మోహున్ బగాన్ - 4:35 PM (IST) (LIVE on TEN 2)
బెంగుళూరు ఎఫ్‌సి Vs ఈస్ట్ బెంగాల్ - 7:05 PM (IST) (LIVE on TEN 2)

ఆదివారం, ఫిబ్రవరి 26
చర్చిల్ బ్రదర్స్ Vs డీఎస్కే శివాజియన్స్ - 4:35 PM (IST) (LIVE on TEN 2)
ముంబై ఎఫ్‌సి Vs మినర్వా పంజాబ్ ఎఫ్‌సి - 7:05 PM (IST) (LIVE on TEN 2)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X