న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్ క్లబ్ లో ఆరుగురు ఇండియన్లకు చోటివ్వాలి: వింగాడ

By Nageshwara Rao

గౌహతి: వచ్చే ఐఎస్ఎల్ సీజన్ నాటికైనా ప్రతి జట్టులోనూ ఆరుగురు భారతీయులు ఉన్నారని నార్త్ఈస్ట్ ప్రధాన కోచ్ నెలో వింగాడ పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్ లో టాప్ లో ఉన్న నార్త్ఈస్ట్ గురువారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ తో పోటీపడుతున్న నేపథ్యంలో వింగాడ ఫేస్ టు ఫేస్..

డిఫెండింగ్ చాంపియన్ ప్రస్తుతం పాయింట్ల సాధనలో వెనుకబడి ఉన్నదని, జాన్ అబ్రహం జట్టు మంచి పాయింట్లు సాధించి చరిత్రాత్మక స్థాయిలో రికార్డు సాధించిందన్నాడు. తాము కోలుకునేందుకు చాలా తక్కువ సమయం ఉందని, వచ్చే 20 రోజుల్లో చాలా బాగా కష్టపడాల్సి ఉన్నదన్నాడు. చెన్నైయిన్ జట్టుతో ఎటువంటి తేడా లేదన్నాడు. రెండు జట్లు చాలా ప్రతిభకలిగినవేనని, ఏ జట్టు గెలువాలన్నా బెస్ట్ ఆటగాళ్లతో మంచి రూపు సంతరించుకుంటే విజయం సాధ్యమేనన్నాడు. చెన్నైయిన్ జట్టు, ఢిల్లీ డైనమోస్ తో ఓటమి పాలైందని, అదే జట్టు తిరిగి ఎఫ్ సి గోవాపై గెలుపొందిందని వింగాడ గుర్తుచేశాడు.

'ప్రస్తుత టోర్నీలో చెన్నైయిన్ కు తక్కువ పాయింట్లు ఉన్నా.. దూసుకు రాగలదు. మేం ఇప్పటికే పది పాయింట్లు సాధించాం. ధ్రుడ సంకల్పంతో ఆడాం. గురువారం జరిగే మ్యాచ్ లో విజయం సాధించి మూడు పాయింట్లు పొందితే మేం మరో ఎనిమిది గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు వచ్చే మూడు పాయింట్లు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మాకు దోహద పడతాయి' అని అన్నాడు.

ఐఎస్ఎల్ లోనే చెన్నైయిన్ పూర్తి సమర్థవంతమైన జట్టని, ఆశ్యర్యకరమైన రీతిలో నార్త్ఈస్ట్ జట్టును ఏనాడు ఓడించలేదని అన్నాడు. ఏ ఏడాదికాయేడు ప్రత్యేకమని, గతేడాది మాదిరిగానే ఇదే సంప్రదాయం కొనసాగుతుందని చెప్పలేం. తమ ప్రత్యర్థి జట్టు, మా జట్టు శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తానన్నాడు.

indian super league

'మా జట్టు క్రీడాకారుల మానసిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందునే మేం విజయం సాధించాం. మేం సంఘటితంగా ముందుకెళుతున్నాం. ప్రతి దాడి చేయగలం. మంచి ప్రేరణతో ఆడుతున్నా.. గురువారం జరిగే మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్లతో అని గుర్తు పెట్టుకుంటాం. గతేడాది ఇదే గట్టి పట్టుదలతో రెండో రౌండ్ లోకి వెళ్లాం' అని తెలిపాడు.

15 రోజుల్లో ఐదు మ్యాచ్ లు ఆడామన్న వింగాడ ఈ రోజు మ్యాచ్ లో ఒకటి, రెండు మార్పులు చేసే అవకాశముందన్నాడు. మంచి గుర్తింపుతో తమ జట్టు లీగ్ టోర్నీలో ముందుకు సాగుతున్నదని తెలిపాడు. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు తొలి ఎడిషన్ లో 19 పాయింట్లు అవసరం అయ్యాయి. రెండో ఎడిషన్ లో పాయింట్ల సంఖ్య 22కు చేరుకున్నది. కనుక తాము 22 పాయింట్లు సాధించాలని లక్ష్యంతో ఉన్నామన్నాడు.

జట్లలో మరింత మంది ఇండియన్లకు చోటు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్న వింగాడ వచ్చే ఏడాది నుంచి ఆరుగురు భారతీయులు, ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో జట్టును రంగంలోకి దించడం వల్ల సత్ఫలితాలు సాధించొచ్చునన్నాడు.

తమ జట్టులో అత్యధికులు భారతీయులు ఉన్నారని, వారిపైనే తాము ఆధార పడి ఉన్నామని చెప్పారు. మిగతా జట్ల గురించి తమకు పూర్తి వివరాలు తెలియవని, కానీ కియాన్ లూయిస్ వంటి వారు అట్లెటికో డీ కోల్ కతా, ముంబై సిటీ జట్లలో మంచి ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X