న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పిచ్‌పై దూకుడు: 'మాకు గెలుపొటములు సమానమే'

By Nageshwara Rao

న్యూఢిల్లీ: తాము గెలుపొటములు కుటుంబ సభ్యులుగా ఉమ్మడిగా స్వీకరిస్తామని ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి ప్లేయర్ మార్సిలిన్హో వ్యాఖ్యానించాడు. పిచ్ పై అరుదుగా దూకుడు ప్రదర్శించే మార్సెలిన్హో.. తమ ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల సామర్థ్యం కలిగి ఉన్నవాడు. మూడు గోల్స్ చేయడంతోపాటు రెండు గోల్స్‌లో సాయం చేసిన మార్సిలిన్హో అటాకింగ్ లో ముందుంటాడు.

కానీ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే పెనాల్టీ కార్నర్ కారణంగా మ్యాచ్ ఓటమి పాలైంది. నాలుగు సక్సెస్ ఫుల్ టేకాన్స్ పూర్తిచేసిన మార్సెలిన్హో.. ఈ ఏడాది జరిగిన ఐదు మ్యాచ్ ల్లో ఎనిమిది కీలకపాస్ అందించిన ఘనత సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగే మ్యాచ్ లో ఆయన ఆటతీరును ప్రతి ఒక్కరూ తప్పక గమనించాల్సిందే.

తాను ఇప్పటివరకు పలు మ్యాచ్ లు ఆడానని, భయపడాల్సిన అవసరమే లేదన్నాడు. బెస్ట్ రిజల్ట్ కోసం ప్రయత్నించడమే తన పని అని చెప్పాడు. తాను ఒక జట్టు కోసం ఆడుతున్నానని, కోచ్ తనకు ఇవ్వాల్సిన గైడ్ లైన్స్ ఇస్తాడని, అందుకనుగుణంగా వ్యవహరిస్తానన్నాడు.

Marcelinho: We are like a family that wins and loses together

కొన్నిసార్లు గోల్స్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు కొద్దిగా అసిస్టెన్స్ మాత్రమే అందొచ్చు. కానీ క్లబ్ కోసం ఎక్కువ కష్టపడటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించాడు. జట్టు వరుసగా వెనకబడితే తన వంటి వారికి చాలా విభిన్నమైన పరిస్థితేనని అంగీకరించాడు. అయితే తాను ఎల్లవేళలా తన ఆటతీరు గురించే ఆలోచిస్తానని వ్యాఖ్యానించాడు.

ప్రతి మ్యాచ్‌లోనూ పాజిటివ్‌గానే ఆలోచిస్తానన్నాడు. ఏ మ్యాచ్ ఫలితాన్ని తాను మరిచిపోనన్నాడు. తాను ఒక మ్యాచ్ గురించి మరిచిపోవాలంటే ఒక విజయం సాధించాల్సిన అవసరం ఉంటుందన్నాడు. తమ జట్టు కుర్రాళ్లలో కావల్సినంత నైతిక స్థైర్యం ఉన్నదని పేర్కొన్నాడు.

తాము గెలుపొటములను సమానంగా, ఉమ్మడిగా స్వీకరిస్తామని మార్సిలిన్హో అన్నాడు. తమ కోచ్ సూచనలు తమకు తెలుసునని, తాము చాలా శక్తిమంతంగా ఉన్నామని భావిస్తున్నట్లు చెప్పాడు.

ఇండియన్ కుర్రాళ్ల క్వాలిటీ స్ఫూర్తిదాయకం: హబాస్
ఐఎస్ఎల్ ప్రారంభమైన 2014నాటితో పోలిస్తే భారతీయ క్రీడాకారుల్లో పరిణతి, క్వాలిటీ స్ఫూర్తిదాయకమని పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్ వ్యాఖ్యానించాడు. వరుసగా మూడు ఎడిషన్లలో భాగస్వామిగా ఉన్న హబాస్.. దేశీయ ఆటగాళ్లు చెప్పుకోదగిన పురోగతి సాధించారన్నాడు. వారు సాధారణంగా ఆటతీరు మెరుగుదల సాధించినా.. మ్యాచ్ ను నియంత్రించడంలో పట్టు, మెరుగుదల సాధించాల్సిన అవసరం ఉందన్నాడు.

ఐఎస్ఎల్ లో పాల్గొంటున్న యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల ప్లేయర్ల కంటే ఏ రోజుకారోజు ఇండియన్ ప్లేయర్లు మెరుగవుతున్నారన్నాడు. స్వదేశీ ప్లేయర్లు, విదేశీ ఆటగాళ్ల రాకతో లీగ్ బలోపేతం అవుతుందని హబాస్ వ్యాఖ్యానించాడు. పుణె క్రియేటివ్ ప్లేయర్ జొన్నాథన్ లుక్కా సైతం హబాస్ అభిప్రాయాన్నే బలపరిచాడు.

తమది పూర్తిగా కొత్త జుట్టని, నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్న కుర్రాళ్లలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నాడు. లీగ్ గడువు కొద్దిగా ఉండటం వల్ల కూడా ఇంప్రూవ్ మెంట్ సాదించలేక పోతున్నట్లు తెలిపాడు. తాము ఏనాడు హింసాత్మక ధోరణితో కూడిన ఆట తీరు ప్రదర్శించలేదన్నాడు. కానీ రిఫరీలు సమర్థవంతంగా ఆడిన వారిని, హింసకు దిగిన వారిని ఒకే రీతిలో పరిగణిస్తారన్నాడు.

2021 వరకకూ మాడ్రిడ్‌తోనే వాజ్ క్వెజ్
స్పానిష్ ఇంటర్నేషనల్ క్లబ్ యూరోపియన్ చాంపియన్స్ జట్లలో ఒక్కటైన రియల్ మాడ్రిడ్‌తో లుకాస్ వాజ్ క్వెజ్ తన అనుబంధాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై రియల్ మాడ్రిడ్ జట్టుతో కాంట్రాక్ట్ పై వాజ్ క్వెజ్ సంతకం కూడా జేశాడు.

తొలుత ఇతడి కాంట్రాక్ట్.. 2020 జూన్ వరకు మాత్రమే ఉంది. కానీ రియల్ మాడ్రిడ్ క్లబ్ నిబంధనలు, మార్గదర్శకాలు అన్నీ నచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పొడిగింపునకు వాజ్ క్వెజ్ అంగీకరించాడు. 2015లో ఇస్పాన్యోల్ నుంచి శాంటియాగో బెర్నాబౌలో చేరిన వాజ్ క్వెజ్ ను రియల్ మాడ్రిడ్ ఫ్రాంచైసీ యాజమాన్యం ఫార్వర్డ్ ప్లేయర్ కోసం బై బ్యాక్ క్లాజ్ తో తమ జట్టులోకి తీసుకున్నది.

ఇప్పటికే రియల్ మాడ్రిడ్ లైనప్ చాలా క్లిష్టంగా ఉంది. క్రిస్టియానో రొనాల్డో, గారెథ్ బాలె, కరీం బెంజేమా వంటి ప్లేయర్లతో వాజ్ క్వెజ్ కలిసి ఆడనున్నాడు. ప్రస్తుత 2015 - 16 సీజన్‌లో 25 మ్యాచ్ లలో పాల్గొన్న వాజ్ క్వెజ్ నాలుగు గోల్స్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X