న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టాప్‌పై ముంబై చెరగని ముద్ర.. టాప్ 4 కోసం ఎదురుచూపు

ఐఎస్ఎల్ 3 ఎడిషన్‍లో ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ముంబై సిటీ ఎఫ్ సి, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా గా ముగిసింది.

ముంబై: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‍లో ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ముంబై సిటీ ఎఫ్ సి, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా గా ముగిసింది. శనివారం రాత్రి ముంబైలోని ముంబై ఫుట్‌బాల్ ఎరినాలో జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

దీంతో ముంబై సిటీ 14 మ్యాచ్‌లలో 23 పాయింట్లతో టాప్ స్థానానికి దూసుకెళ్లగా, ఢిల్లీ డైనమోస్ జట్టు 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఆదివారం కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి టాప్ 4లో నిలిచి సెమీ ఫైనల్స్ బెర్తుకు అర్హత సాధించేది ఎవరన్నది ఖరారవుతుంది.

తద్వారా సెమీ ఫైనల్స్ పరస్పరం తలపడేదెవరన్నదని తేలుతుంది. ఇరు జట్లకు ప్రత్యేకించి ముంబై సిటీ టీంకు రెండు, మూడుసార్లు గోల్స్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోలేకపోయింది. ఫలితంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ గోల్స్ లేకుండానే 0 - 0 తేడాతో డ్రాగా ముగిసింది. రెండుసార్లు ముంబై సారధి డియాగో ఫోర్లాన్ గోల్ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఢిల్లీ గోల్ కీపర్ డోబ్లాస్, ప్లేయర్ సోనీ నోర్డే అడ్డుకున్నారు.

ప్రస్తుత సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో టాప్‌లోకి దూసుకొచ్చి ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో బెర్తు సాధించుకున్న ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్ జట్లు పరస్పరం హోరాహోరీ తలపడ్డాయి. గోల్స్ సాధించడానికి పరస్పరం పోటీ పడ్డాయి.

ముంబై సారధి డియాగో ఫోర్లాన్ 22వ నిమిషంలో ఫస్ట్ షాట్‌తో గోల్ కోసం ప్రయత్నించాడు. ఈ ఉరుగ్వేయన్ స్ట్రయికర్ పంపిన బంతి ఎడమవైపు నుంచి మంచి క్రాస్ ఫీల్డ్ మీదుగా వెళ్లింది. కానీ ఢిల్లీ డైనమోస్ గోల్ కీపర్ టోనీ డోబ్లాస్ డేంజరస్ ఏరియాలో తిప్పికొట్టాడు. 36వ నిమిషంలో ముంబై ప్లేయర్ క్రిష్టియాన్ వాడోక్జ్ దూరం నుంచి పంపిన బంతి గోల్‌పోస్ట్ వద్ద నుంచి వైడ్‌గా మారి వెళ్లిపోయింది. సేహ్నాజ్ సింగ్ సరిగ్గా 45వ నిమిషంలో గోల్ కోసం విఫలయత్నం చేశాడు. కానీ ఢిల్లీ కీపర్ డోబ్లాస్ దాన్ని తిప్పికొట్టాడు.

 Mumbai cement pole position after 0-0 against Delhi

ఇక ఢిల్లీ కుర్రాళ్లు తొలి అర్ధగంట వరకు గోల్ సాధన కోసం బంతిపై ద్రుష్టిని సారించలేదు. అంతేకాదు. గోల్ సాధించేందుకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. ఫస్టాఫ్ ముగింపునకు ఆరు నిమిషాల ముందు బ్రూనో పెలిస్సారి గోల్ పోస్ట్ సమీపానే ఫ్రీ కిక్ ద్వారా బంతిని వలయాలుగా తిప్పుతూ పంపారు. ఫస్టాఫ్ చివరి నిమిషంలో ఇరు జట్లు గోల్స్ సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, ఢిల్లీ కీపర్ డోబ్లాస్ బంతిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు.

ఢిల్లీ ప్లేయర్ పెలిస్సారి సెకండాఫ్‌లో 53వ నిమిషంలో కార్నర్ మీదుగా తొలిసారి కొట్టిన కిక్‌ను ముంబై డిఫెన్స్ బ్లాక్ చేసింది. తర్వాత 12 నిమిషాలకు ముంబై సారధి డియాగో లెఫ్ట్ ఫుట్ సాయంతో పంపిన బంతి తర్వాత నేరుగా కార్నర్ మీద నుంచి క్రాస్ బార్ దాటిపోయింది. ఆతిథ్య జట్టుకు 72వ నిమిషంలో గోల్ చేసేందుకు సువర్ణావకాశం లభించింది. కాఫు పంపిన షాట్ క్రాస్ బార్ మీదుగా దాటుకుని వెళ్లిపోయింది. ఇన్‌సైడ్ బాక్స్ నుంచి ముంబై సారధి డియాగో ఫోర్లాన్ పంపిన బంతిని ఢిల్లీ ప్లేయర్ సోనీ నోర్డే గుడ్ పొజిషన్‌లో విజయవంతంగా అడ్డుకున్నాడు. నోర్డే అప్రమత్తంగా లేకుంటే ఢిల్లీపై ముంబై జట్టు ఆధిపత్యం సాధించగలిగేది.

మ్యాచ్ ఫుల్ టైంకు ఏడు నిమిషాల ముందు ముంబై జట్టుకు విజయం సాధించేందుకు అద్భుతమైన చాన్స్ లభించింది. ఇన్‌సైడ్ బాక్స్ నుంచి గెర్సన్ వైరా మీదుగా వస్తున్న బంతిని ముంబై సారధి డియాగో ఫోర్లాన్ ఫ్రీ కిక్ ద్వారా గోల్ పోస్ట్ దారిమళ్లించినా ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ డిఫెన్స్ ఆ బంతిని నిలువరించడంతో ముంబై ఆశలు అడియాసలయ్యాయి. మళ్లీ చివరి నిమిషంలో కుడివైపు నుంచి ఉదాంతా సింగ్ పంపిన బంతి గోల్ పోస్ట్ మీదుగా వైడ్ గా మారి దూసుకెళ్లడంతో మ్యాచ్ గోల్స్ లెస్ డ్రాతో ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X