న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వంటిచేత్తో గెలిపించిన ఫోర్లాన్: టాప్‌లోకి ముంబై

By Nageshwara Rao

కోల్‌కతా: ముంబై సిటీ ఎఫ్ సి సారధి డియాగో ఫోర్లాన్ తన సత్తా ఏమిటో మరోసారి రుజువుచేశాడు. కోల్‌కతాలోని రవీంద్ర సరోవర్ స్టేడియంలో మంగళవారం రాత్రి అట్లెటికో డీ కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌ సెకండాఫ్ ముగియడానికి 11 నిమిషాల ముందు గోల్ చేసి ముంబై జట్టును గెలిపించాడు. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేర్చాడు.

ఈ ఏడాది లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి 2014 చాంపియన్లుగా నిలిచిన అట్లెటికో డీ కోల్‌కతా జట్టుకు ఇది తొలి పరాజయం. మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషం నుంచే ముంబై కుర్రాడు సోనీ నోర్డె దూరం నుంచి పంపిన బంతిని అట్లెటికో డీ కోల్‌కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ అడ్డుకున్నాడు. మరో రెండు నిమిషాల తర్వాత మళ్లీ నోర్డే కాఫఉ పంపిన పాస్‌ను డేంజరస్ పొజిషన్‌లో కొట్టిన కిక్.. పెనాల్టీ బాక్స్ వద్ద ఎడ్జ్ మీదుగా దూసుకెళ్లిపోయింది.

33వ నిమిషంలో నోర్డే కోల్‌కతా వైపు కలిసొచ్చిన స్పేస్‌ను తనకు అనువుగా మార్చుకుని పంపిన బంతిని అద్భుతంగా అడ్డుకుని మజుందార్.. తన జట్టును కాపాడుకోగలిగాడు. కోల్‌కతా రెండువైపులా బంతిని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగడంతో ఏ జట్టు కూడా గోల్ సాధించలేకపోయింది. ఫలితంగా ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఏ జట్టు గోల్ చేయకపోవడంతో ముంబై కుర్రాళ్లు నిరాశకు గురయ్యారు.

Mumbai go top of the league with 1-0 win against ATK

అంతకుముందు 24వ నిమిషంలో కోల్ కతా ప్లేయర్ జావీ లారా ప్రీ కిక్ ద్వారా పంపిన బంతి గోల్ పోస్ట్ గోడను తాకి తిరిగి అతడిని వద్దకే వచ్చి చేరింది. మరోసారి లారా కొట్టిన కిక్ తో బంతి క్రాస్‌బార్‌ను దాటుకుని వెళ్లిపోయింది. ఇక సెకండాఫ్‌లో ఎటికె మేనేజ్‌మెంట్ బిద్యానంద సింగ్‌ను అభినాశ్ రుయిదాస్ స్థానే సబ్‌స్టిట్యూట్‌గా ప్రవేశపెట్టింది. ఆ మేరకు బిద్యానంద సింగ్ కూడా తనకు వచ్చిన అవకాశాన్నిసద్వినియోగంచేసుకుని బంతిని ఇయాన్‌హుమ్‌కు పాస్ చేయడంలో సహకరించాడు.

సెకండాఫ్‌లోనూ ముంబై ప్లేయర్ నోర్డె మరోసారి గోల్ కొట్టేందుకు విశ్వ ప్రయత్నంచేశాడు. కానీ మరోసారి ఆయన పంపిన బంతి టార్గెట్‌ను చేరనే లేదు. ముంబై షాట్ స్టాపర్ అల్బినో గోమెస్ 59వ నిమిషంలో ఇయాన్ హుమ్ పంపిన బంతిని అంచనా వేయలేకపోవడంతో ఎటికె లీడ్‌లోకి వెళ్లేందుకు అవకాశం చిక్కినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో సమీగ్ దౌటీ బంతిని గోల్ పోస్ట్‌కు పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని ముంబై డిఫెన్స్ విజయవంతంగా అడ్డుకున్నది.

హుమ్ పంపిన బంతిని గోమ్స్ అడ్డుకున్న తర్వాత కోల్‌కతా అటాకింగ్ ధోరణితో ఆడింది. కానీ కోల్ కతా గోల్ చేసే అవకాశం రాకపోగా.. తర్వాత 11 నిమిషాలకు ముంబై లీడ్ సాధించే చాన్స్ చ్చింది. నోర్డె మరోసారి తన మ్యాజిక్ ను ఉపయోగించి బంతిని డేంజర్ ఏరియాలోకి పంపాడు. దీన్నిసావకాశంగా తీసుకున్న ముంబై సారధి ఫోర్లాన్ తెలివిగా పంపిన బంతి.. గోల్ కీపర్ మజుందార్‌ను అదిగమించి గోల్ పోస్ట్‌కు చేరిపోయింది.

అనూహ్యంగా చివర్లో ముంబై లీడ్‌లోకి రావడంతో అప్రమత్తమైన కోల్‌కతా ఫార్వర్డ్ ప్లేయర్లపై ఒత్తిడి తెచ్చింది. 85వ నిమిషంలో కార్నర్ ద్వారా గోల్ సాధించి స్కోర్ సమం చేయడానికి విఫలయత్నం చేశాడు. హుమ్ షాట్‌ను లుసియా గౌయాన్ అడ్డుకోవడంతో కోల్ కతా ఆశలు అడియాసలయ్యాయి. ఆ తర్వాత జావీ లారా పంపిన ప్రీ కిక్ షాట్‌ను ముంబై గోల్ కీపర్ గోమ్స్ అడ్డుకోవడంతో స్కోర్ సమంచేసేందుకు సౌరవ్ సేన చివరి ప్రయత్నం ఫలించలేదు.

కోల్‌కతాపై తమ జట్టు విజయం గర్వంగా ఉన్నదని ముంబై కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. కొన్ని సందర్భాల్లో మాటియాస్ డెఫెడెరికో, భౌథాంత్ హావ్ కిప్, ప్రొనాయ్ హల్డర్ లతోపాటు గోల్ కీపర్ రోబర్టో వొల్పాటో వంటి వారు కొన్ని పొరపాట్లు చేసినా కుర్రాళ్లంతా మెరుగ్గా ఆడారని ప్రశంసించాడు. అట్లెటికో డీ కోల్ కతా వంటి మంచి ఫామ్ లో ఉన్న జట్లపై విజయం సాధించగలమన్నాడు. గాయాలతో బాధపడుతున్నా కోల్ కతా కూడా మంచి ఆటతీరే ప్రదర్శించిందన్నారు. తొలి ఆఫ్ లోనూ తాము బాగా ఆడామని, అయితే సెకండాఫ్ లో డిఫెన్స్ మంత్రం పాటించామన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X