న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అరుదైన ఘట్టం: మారడోనాతో కలిసి ఆడనున్న దాదా, పిళ్లై

గంగూలీ, పిళ్లైలు ఓ ఛారిటీ పుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ప్రముఖ అర్జెంటీనా పుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా కలిసి ఆడనున్నారు.మ్యాచ్ కోసం డిగో మారడోనా భారత్‌కి రానున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, మాజీ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లైలు ఓ ఛారిటీ పుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ప్రముఖ అర్జెంటీనా పుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా కలిసి ఆడనున్నారు. ఈ మ్యాచ్ కోసం డిగో మారడోనా భారత్‌కి రానున్నాడు.

ఛారిటీ మ్యాచ్‌లో భాగంగా మార‌డోనా అక్టోబ‌ర్ 2 నుంచి 4 మ‌ధ్య కోల్‌క‌తాలో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్ కతాకు చెందిన మోహ‌న్ బ‌గాన్ క్ల‌బ్ ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తోంది. ఆ మ్యాచ్‌లో ఇండియ‌న్ హాకీ మాజీ కెప్టెన్ ధ‌న్‌రాజ్ పిళ్లే, క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ కూడా ఆడ‌నున్నారు.

Sourav Ganguly, Dhanraj Pillay to play a charity match with Diego Maradona

ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి 'మ్యాచ్ ఫ‌ర్ యునైటీ' అనే టైటిల్ పెట్టారు. ఈ మ్యాచ్‌లో బెంగాలీ పాపుల‌ర్ హీరో అబిర్ ఛ‌ట‌ర్జీ, క్రికెట‌ర్లు మ‌నోజ్ తివారీ, దీప్‌దాస్ గుప్తాలు కూడా పాల్గొననున్నారు. బ‌రాస‌త్‌లో ఉన్న ఆదిత్యా స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.

భారత పర్యటనకు డిగో మారడోనా రావడం ఇది రెండోసారి. మరోవైపు భార‌త జట్టు త‌ర‌పున ఆడిన మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు ప్రసూన్ బెనర్జీ, కార్ల్టన్ ఛాపమ్యాన్, దైపెందు బిస్వాస్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గోనున్నారు. భారత మాజీ పుట్‌బాల్ కెప్టెన్ బైచింగ్ భూటియాని కూడా నిర్వహకులు ఈ విషయమై సంప్రదించారు.

అయితే దీనిపై భూటియా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో దసరాని పురస్కరించుకుని ఈ పుట్‌బాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో గెలిచిన విజేతలకు మారడోనా చేతుల మీదుగా బహుమతిని అందజేయనున్నారు. ఆగస్టు 20న టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X