న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెత్త ఏరుకుంటున్న ఒకనాటి బాక్సింగ్ ఛాంపియన్

కాన్పూర్: బాక్సింగ్‌లో ఒకప్పప్పుడు అతను జాతీయ ఛాంపియన్‌. ఇప్పుడు చెత్త ఏరుకుని జీవనం గడుపుతున్నాడు. క్రికెట్‌, టెన్నిస్‌ లాంటి ఒకటి రెండు ఆటలకు తప్ప మనదేశంలో ఇతరత్రా ఆటలకు, ఆటగాళ్లకు ఏ మాత్రం ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందో చెప్పడానికి కమల్‌కుమార్‌ జీవితమే నిదర్శనంగా నిలుస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన కమల్‌కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. అదే ఇష్టంతో 1991లో జరిగిన జాతీయ బాక్సింగ్‌ పోటీల వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత 1993, 2004, 2006లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్య, వెండి పతకాలు సాధించాడు.

 Former boxer forced to work as garbage collector in Uttar Pradesh

అయితే ఆ తర్వాత ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఇప్పుడు పోటీల్లో పాల్గొనే శక్తీ లేదు.. అవకాశమూ లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆఖరికి ఇలా చెత్త ఏరుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఇంతజరిగినా ఆట పట్ల అతని అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. తన నలుగురు పిల్లల్లో ఇద్దరినైనా బాక్సింగ్‌ ఛాంపియన్స్‌ చేయాలనే కోరికతో వారికి తానే శిక్షణ ఇస్తున్నాడు కమల్‌. ఇప్పటికైనా తన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరుతున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X