సిడ్నీ: పొట్ట కూటి కోసం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు అర్షద్ ఖాన్ సిడ్నీలో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఒకప్పుడు పాక్ తరఫున ఆ క్రికెటర్ డ్రైవర్గా పని చేస్తూ.. తన క్యాబ్ ఎక్కిన వారికి తన క్రికెట్ జీవితాలను కూడా పంచుతున్నాడు.
పాకిస్తాన్ అయినా, భారత్ అయినా, ఆస్ట్రేలియా అయినా.. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేస్తే.. జీవితం సాఫీగా సాగుతుందని అందరు అనుకుంటారు. కానీ, అర్షద్ ఖాన్ జీవితం చూశాక అది అవాస్తవంగా కనిపిస్తోంది.
1997లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి బౌలర్గా అర్షద్ అడుగు పెట్టాడు. 9 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 32, వన్డేల్లో 56 వికెట్లు తీశాడు. భారత దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ల వికెట్లు కూడా అర్షద్ ఖాతాలో ఉన్నాయి.
ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లోనూ ఆడాడు. లోహోర్ బాద్ షా తరఫున ఆడినప్పుడు హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత కనుమరుగయ్యాడు. ఇప్పుడు సిడ్నీలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి ఆస్ట్రేలియా వెళ్లాడు. అతడిని అర్షద్ ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు.
మాటల సందర్భంలో తాను పాకిస్థానీనని అని తెలిపాడు. హైదరాబాదుతో పెనవేసుకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నీళ్లు, స్నాక్స్ కూడా ఆఫర్ చేశాడు. ఎన్నో విషయాలు మాట్లాడాడు. కానీ క్రికెట్ గురించి మాట్లాడలేదు.
కాగా, చివరి క్షణంలో అతనిని గుర్తించిన ఆ వ్యక్తి... మీరు అర్షద్ కదా? అని అడిగినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. కాగా, అర్షద్ చివరి వన్డే, చివరి టెస్టు భారత్ పైనే ఆడాడు. బెంగళూరులో చివరి టెస్ట్, రావల్పిండిలో చివరి వన్డే ఆడాడు. కాగా, అర్షద్ గురించి పోస్ట్ చేసిన వారు గణేష్ అనే వ్యక్తి.