హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ భారత టెన్నిస్ స్టార్ బోపన్న జోడీ విజేతగా నిలిచింది. ఏడో సీడ్ రోహన్ బోపన్న కెనడాకు చెందిన పాట్నర్ గాబ్రియేలా దాబ్రోవ్స్కీల జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచారు.
గురువారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ జోడీ ఫరా, గ్రోన్‌ఫెల్డ్‌పై 2-6, 6-2, 12-10 తేడాతో బోపన్న జోడీ విజయం సాధించింది. రోహన్ బోపన్నకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నాలుగో భారత టెన్నిస్ ఆటగాడిగా బోపన్న నిలిచాడు.
దాదాపు ఏడేళ్ల తర్వాత అతను ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరాడు. 2010లోనూ బోపన్న యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించడంలో విఫలమయ్యాడు.
Champs! @GabyDabrowski/@rohanbopanna defeat Groenefeld/Farah 2-6, 6-2, 12-10 for the mixed doubles title. #RG17 pic.twitter.com/pVhkp3Fh7W
— Roland-Garros (@rolandgarros) June 8, 2017
🏆 @GabyDabrowski @rohanbopanna #RG17 pic.twitter.com/hfGXKg8HyT
— Roland-Garros (@rolandgarros) June 8, 2017