న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన జీవితం: వ్యభిచారిణిగా మారిన బాలిక

వడోదరా: చిన్నతనం నుంచి ఖరీదైన ఫోన్, విలాసంతమైన జీవితం అనుభవించాలనే కోరికతో ఓ బాలిక తన జీవితాన్నే నాశనం చేసుకుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమెకు విలాసంతమైన జీవితంపై మోజు పెరగడంతో డబ్బుల కోసం అనాలోచితంగా వ్యభిచార కూపంలోకి వెళ్లింది. ఆమెకు మంచి చెడు తెలిసే లోపే ఆమె జీవితాన్ని అంధకారంగా మారిపోయింది.

ఇంట్లోకి వారికి కూడా తెలియకుండా తీసుకున్న నిర్ణయంతో ఆమె బంగారు భవిష్యత్ శిథిలమైపోయింది. తమ కూతురు గర్భవతి అన్న విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. జరిగినదానికి ఏమీ చేయలేక తమను తామే నిందించుకున్నారు. ఈ కథనమంతా గుజరాత్ రాష్ట్రంలోని ఓ మైనర్ బాలిక(13) గురించి.

వివరాల్లోకి వెళితే.. సుభాన్ పురా ప్రాంతంలో కిరాణం నడుపుకునే తల్లి తన పదమూడేళ్ల కూతురు గర్భవతి అనే తెలుసుకొని దిగ్ర్భాంతికి గురైంది. కూతురు చెప్పిన కారణాలు విని నిర్ఘాంత పోయింది. అలా చేయడం తప్పని వారించింది. వ్యభిచారం నేరమని.. పద్ధతి మార్చుకోమని బతిమలాడుకుంది.. కానీ ఆ అమ్మాయి వినలేదు.

మరింత విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీంతో ఎలాగైనా ఆమెను దారిలో పెట్టాలనుకున్నతల్లి మేనమామగారింటికి పంపించి వేసింది. కానీ ఆత్మహత్య చేసుకుంటానని కూతురు బెదిరించడంతో ఇక చివరి ప్రయత్నంగా గుజరాత్‌లోని అభయం టోల్ ఫ్రీ నెం. 185ను సంప్రదించింది.

 Gadget greed leads Gujarat girl, 13, to prostitution

ఫ్యామిలీ కౌన్సెలర్ కౌన్సెలింగ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 'నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి. నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా. వాటికోసమే ఈ పని చేశా. అమ్మ షాప్‌కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే ఈ పని చేశా'నని కౌన్సెలింగ్‌లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్‌ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ఉండటం చూసి కౌన్సెలర్ విస్తుపోయారు. తను ఎంచుకున్న మార్గం సరైనది కాదని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

కాగా, భర్త చనిపోవడంతో.. కుటుంబ భారం నెత్తిన పడి కూతుర్ని అంతగా పట్టించుకోలేకపోయానని తల్లి వాపోయింది. ఆనంద్ ప్రాంతానికి వీరు వ్యాపారం రీత్యా వడోదరాలో స్థిరపడ్డారు. ఈ అమ్మాయిని పసిపాపగా ఉన్నపుడే దత్తత తీసుకున్నారు. కాగా, మూడేళ్ల క్రితం ఆ అమ్మాయి తండ్రి చనిపోయారు.

ఖరీదైన పరికరాలు, విలాసవంతమైన జీవితం పిల్లాపెద్దా అందరిపైనా ప్రభావం చూపుతుందనీ మానసిక నిపుణులంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. స్నేహపూర్వక పర్యవేక్షణ అవసరమని చెబుతున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X